నేను ఆయనకు అల్లుడిని కాదా? | Three primary poltician families to make issues of Zamathas | Sakshi
Sakshi News home page

నేను ఆయనకు అల్లుడిని కాదా?

Published Mon, Sep 28 2015 1:25 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వనందుకు విలపిస్తున్న పాశ్వాన్ అల్లుడు అనిల్ కుమార్ సాధు - Sakshi

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వనందుకు విలపిస్తున్న పాశ్వాన్ అల్లుడు అనిల్ కుమార్ సాధు

రాజకీయ కుటుంబాలు తమ పార్టీల్లోకి కుమారుడి ప్రవేశాన్ని తర్వాత అతడికి పదవి కట్టబెట్టడాన్ని ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రకటించుకుంటున్నాయి. కుటుంబ నేపథ్యంతోనే అతడికి ప్రమోషన్ ఇచ్చారనే విషయాన్ని కనుమరుగు చేస్తున్నాయి.
 
 అల్లుళ్లతో బాధలు బిహార్ రాజకీయాలనూ వదిలేటట్టు లేవు. ఆ రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ కుటుంబాలు జామాతలతో సతమతమ వుతున్నాయి. ఒకటి రామ్‌విలాస్ పాశ్వాన్ కుటుంబం, రెండు లాలూప్రసాద్ యాదవ్ కుటుంబం, మూడు జీతన్ మాంఝీ కుటుంబం. అల్లుడిని నెత్తిన పెట్టుకొని గౌరవించే మనదేశంలో కుమార్తెను బలవంతపు సంతోషంలో ఉంచడానికి అల్లుళ్ల గొంతెమ్మ కోరికలన్నింటినీ తీర్చాల్సి ఉంటుంది.

తన పార్టీలో తిరుగులేని నేత అయిన పాశ్వాన్ రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కటుంబా సీటును తన అల్లుడికి ఇచ్చేందుకు నిరాకరిం చారు. ఆ స్థానాన్ని పార్టీకి చెందిన మరొక సభ్యుడికి ఇవ్వాలని పాశ్వాన్ నిర్ణయించారు. దీంతో పాశ్వాన్ అల్లుడు టీవీల ముందుకు వచ్చి కన్నీటి పర్యంతమవుతూ, ‘నేను ఆయనకు అల్లుడినా కాదా?’ అంటూ ప్రశ్నించాడు. తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకునేందుకు తన మద్దతుదారులను కూడగ ట్టాడు. నన్ను స్వంతం చేసుకుంటారో లేక వదిలేస్తారో వాళ్లే తేల్చుకోవాలని కూడా ప్రకటించాడు. దీనిపై లోక్ జనశక్తి పార్టీ స్పందన తగుమాత్రంగా కూడా లేదు. పాశ్వాన్ తనయుడు చిరాగ్ (ఎంపీ) ఈ సమస్యను కుటుంబంలోనే పరిష్కరించుకుంటామని తప్పించుకున్నారు. బావమరిది అంటే అన్న లాంటి వాడు కనుక ఈ వ్యవహారాన్ని కుటుంబ పెద్దలే పరిష్క రిస్తారు అని చిరాగ్ వివరించారు. అంటే పార్టీ కాకుండా కుటుంబమే ఇక్కడ సుప్రీం అన్నమాట.
 
 మరోవైపు ఎంపీ తేజ్ ప్రసాద్ యాదవ్ పిల్లనిచ్చిన తన మామ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీకే వ్యతిరే కంగా ప్రచారం చేస్తున్నారు. తేజ్ ప్రసాద్ కూడా ములా యం సింగ్ యాదవ్ మునిమనవడు. లౌకికవాదాన్ని సజీవంగా ఉంచడానికి రెండు ప్రముఖ రాజకీయ కుటుంబాల మధ్య సంబంధాలను దృఢతరం చేసే ప్రక్రియలో భాగంగానే ఇతడి పెళ్లి కూడా జరిగింది. పూర్వం రాజులు తమ రాజకీయ బంధాలను బలపర్చు కోవడానికి వివాహ సంబంధాలు కుదుర్చుకున్న చరిత్ర ను ఇది గుర్తుకు తెస్తుంది.
 
 అయితే పెళ్లయితే జరిగింది కానీ, ములాయం సింగ్ బిహార్ మహా కూటమి నుంచి తప్పుకోవడంతో ఇక్కడ రాజకీయ బంధానికి తావు లేకుండా పోయింది. ఇక మూడవ ఉదంతం బిహార్ మాజీ ముఖ్య మంత్రి జీతన్ మాంఝీ అల్లుడు దేవేంద్ర మాంఝీతో ముడిపడింది. మాంఝీతో కుదిరిన బాంధవ్యం కారణంగా వ్యక్తిగత సహాయకుడిగా తన పదవి నుంచి దేవేంద్ర వైదొలిగాడు కానీ, అతడి ఆకాంక్షలను పిల్లనిచ్చిన మామ మాంఝీయే తోసిపు చ్చారు. అల్లుడి కి బదులుగా కుమారుడికి అసెంబ్లీ సీటు కట్టబెట్టారు.
 
 పార్టీ గుర్తింపులతో సంబంధం లేకుండా రాజకీయ కుటుంబాల మొత్తం ఆచరణ ఎలా ఉందంటే పార్టీలోకి కుమారుడి ప్రవేశం, తర్వాత అతడికి ఏదో ఒక పదవి కట్టబెట్టడాన్ని ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రకటించుకుం టున్నారు. వీరు ఒకసారి గెలుపొందగానే, కుటుంబం నేపథ్యం కారణంగానే అతడికి ప్రమోషన్ ఇచ్చారనే విషయాన్ని కనుమరుగు చేస్తున్నారు. అతడు లేక ఆమె ఓటర్ల ఆమోదం పొందారు మరి. ఇక వంశపారంపర్య రాజకీయాల గురించి రంధ్రాన్వేషణ చేసేదెవరు?
 
 ఒక డాక్టర్ కుమారుడు వైద్య వృత్తిని చేపడుతు న్నప్పుడు, లాయర్ కుమారుడు కూడా న్యాయవాద వృత్తిని చేపడుతున్నప్పుడు తప్పేమిటని సాధారణంగా వాదిస్తుంటారు. కాబట్టి రాజకీయాల్లో ఇలాంటిది జరిగి తే తప్పేమిటనే వాదనతో ప్రజలు ప్రశ్నించడమే మాను కున్నారు. శక్తివంతమైన రాజకీయ నేత వారసుడిగా ఉన్నప్పుడు, ఎన్నికలు ఎలాంటి సైద్ధాంతిక సమస్యలపై కాకుండా, శక్తివంతమైన స్థానిక రాజకీయాల ప్రాతిపది కన జరుగుతున్నప్పుడు రాజకీయ కుటుంబాలు ఈ విషయంలో స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నాయి.
 
 ఇప్పుడు నడుస్తున్న ఘటనలను చూస్తుంటే, రాజకీయాల్లో కుమారుడి కంటే అల్లుడి ప్రవేశం అనేది మహా సంకటంగా పరిణమిస్తూ ఉండవచ్చు. ఈ కుటుంబాలు కులం, ప్రాంతంపై పట్టు కలిగి ఉంటాయి. దీంతో ప్రయోజనాలు వారి కుటుంబాలకే అనుకూలంగా ఉంటాయి. ఉదాహరణకు ములాయం కుటుంబాన్నే తీసుకోండి. సమాజ్‌వాదీ పార్లమెంటరీ పార్టీ ఆయన కుటుంబం లాంటిది. పార్లమెంటులో ఏదైనా వ్యూహంపై చర్చించాలనుకుంటే ఆయన కుటుంబ భోజనాల బల్లపైనే జరుగుతుంది. అది కూడా పూర్తి కోరం(నిర్ణీత సంఖ్య)తో జరుగుతుంది.
 
 ఆ  సమావేశంలో ములాయం, ఆయన మేనల్లుళ్లు ధర్మేంద్ర, అక్షయ్, కోడలు డింపుల్ ఉంటారు. ఇక డింపుల్ భర్త అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ములాయం దాయాది రాంగోపాల్ యాదవ్ రాజ్యసభ ఎంపీ. ఇక ములాయం సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ అఖిలేష్ కేబినెట్‌లో మంత్రి. కీలక స్థానాల్లో ఉన్న ములాయం కుటుంబ సభ్యులను గమనిస్తే ఇంత శక్తివంతమైన కుటుంబం దేశంలోనే మరెక్కడా లేదనిపిస్తుంది.
 
 అల్లుళ్ల ప్రత్యేకతకు తోడుగా, ఇవి రెండు బలమైన రాజకీయ కుటుంబాలు. ములాయం సింగ్ యాదవ్ కుటుంబం దాయాదులను కలుపుకుని పలుతరాల వారితో కూడుకుని ఉంది. ఇక లాలూప్రసాద్ యాదవ్ కుటుంబంలో అయితే అల్లుడి సమస్య కాస్త ఉన్నప్పటికీ, ఆయన పార్టీ ప్రధానంగా తన కుటుంబానికే (భార్య, పిల్లలు) పరిమితమైంది. సాధు అని పిలిచే అనిరుధ్ యాదవ్ లాలూతో రాజకీయ జగడం పెట్టుకుని పార్టీ నుంచి వైదొలగడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి లోక్‌సభ సభ్యుడయ్యారు.
 
 ఇలా అల్లుళ్లు, బావమరుదుల సమస్యలు ఉన్నప్ప టికీ, ఈ రెండు కుటుంబాలకు ఒక విశిష్ట లక్షణం ఉంది. పార్లమెంటు లేదా ఏవైనా రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరిపిన ప్రతిసారీ దేశం కుటుంబాల నియంత్రణవైపు కొట్టుకుపోతున్నట్లు నిర్ధారణలను అందించేది. పాశ్వాన్ కూడా తన కుటుంబాన్ని రాజకీయ క్రీడలో భాగం చేయడానికి సోదరుడు పశుపతి పాశ్వాన్, మేనల్లుడు ప్రిన్స్ రాజ్‌కు టికెట్లు ఇవ్వాలని చూశారు.
 
దేశంలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు నెహ్రూ గాంధీ కుటుంబాన్ని వారసత్వ మూలాలున్న రాజకీయ కుటుంబంగా అనుమాన దృక్కులతో చూస్తున్నప్పటికీ, ఇతరులు కూడా దీన్ని అనుసరిస్తూ రాజకీయ కుటుం బాల వైపు వరుస కడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న బిహార్ కేసి చూసినాసరే, దీనికి సంబం ధించి ఎన్నో ఉదంతాలు మనకు కనబడతాయి. చివరకు భారతీయ జనతా పార్టీ కూడా ఈ దురాకర్షణకు లోనవుతోంది.

బిహార్‌లో రెండు ప్రధాన కూటములలో అభ్యర్థులను ప్రకటించే కొద్దీ వారికి వ్యతిరేకంగా తిరుగు బాటు కొనసాగుతోందని ది హిందూ పత్రిక ఇటీవలే నివేదించింది. మొత్తం మీద ఘటనలను పరిశీలిస్తుంటే బిహార్‌లో పార్టీకి బదులు కుటుంబాలకే ప్రాధాన్యత ఉందని స్పష్టమవుతుంది. దాంట్లో అల్లుళ్లకు కూడా కాస్త పాత్ర ఉంటోందని చెప్పవచ్చు.
 (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
 ఈమెయిల్: mvijapurkar@gmail.com)
 - మహేష్ విజాపుర్కార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement