ఓరుగల్లులో పుట్టిన బమ్మెర పోతన ఒంటి మిట్ట రామాలయంలో కూర్చుని భాగవతాం ధ్రీకరణ చేశారు. అంటే సంస్కృతంలోని గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. దీనిని తెలంగాణీకరణ అని ఏ చరిత్ర చెప్పలేదు. అయితే ఈ మధ్య ఉన్నత పదవులలో ఉన్న ఒక మహిళ చేసిన వ్యాఖ్య వాస్తవానికి దూరంగా, అవగా హనారాహిత్యంతో ఉందని చెప్పక తప్పదు. ఆంధ్రీకరణకు, తెలంగాణీకరణకు తేడా తెలియకుండా ఆమె మాట్లాడారని చెప్పక తప్పడం లేదు. తెలంగాణ తెలుగులో ఒక యాస. ఆంధ్ర శాతవాహన వంశం తెలు గుకు జన్మస్థానం. ఈ భాష వర్ధిల్లినది విజ యనగర ఆస్థానం. తెలుగువల్లభుడు శ్రీకృష్ణ రాయలు.
పెద్దన, నంది తిమ్మన, మాదయ గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, ధూర్జటి, రామరాజ భూషణుడు (భట్టు మూర్తి), పిన వీరభద్రుడు, తెనాలి రామలిం గడు ఆయన ఆస్థాన కవులు. వీరే అష్టదిగ్గ జాలు. కాకతి గణపతిదేవునికి కూడా ఆంధ్ర, సంస్కృత భాషలను ఆదరించిన చరిత్ర ఉంది. మనం తెలుగు నేల మీద ఎక్కడ ఉన్నా, మనం ఢిల్లీ లేదా ఇతర ప్రాం తాలకు వెళితే తెలుగువారిగానే గుర్తి స్తారు. మన భౌగోళిక ప్రాంతాలు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలను బట్టి మనకు గుర్తింపు రాదు. తెలుగు నేల మీద నివసిస్తున్నవారు ఆలుగడ్డని బంగాళాదుంప అనండి. సొరకాయను ఆనప అనండి. టెంకాయ, కొబ్బరికాయ అని పిలుచుకోవచ్చు. కానీ తెలుగంటే తెలం గాణ అని తీర్మానించడం సరికాదు. భౌగోళి కంగా విడిపోయినా, ఒక భాషకు చెందిన వారిగా చెప్పడానికి సందేహం ఎందుకు? దానికి ఎవరికి తోచిన భాష్యాలు వారు చెప్ప డం ఎందుకు?
శ్రీపతి వెంకటరంగరాజు హైదరాబాద్