దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో చేతి వృత్తులు అత్యం త కీలకమైనవి. ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతున్నా ఇప్పటికీ చాలా గ్రామాల్లోని ప్రజలు చేనేత వృత్తిపై ఆధారపడి బ్రతుకీడుస్తూనే ఉన్నారు. దేశంలో వ్యవ సాయం తర్వాత అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది ఇప్పటికీ చేనేత రంగమే. దేశ ఆర్థికాభి వృద్ధిలో కీలక బాధ్యత వహిస్త్తున్న చేనేత రంగం ప్రాధాన్యతను దృష్ట్టిలో పెట్ట్టుకుని ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించాలని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ స్థాయిలో నేతన్నల గొప్పదనాన్ని గుర్తించి జాతీయ చేనేత దినోత్సవం జరపడం ఇదే మొదటి సారి. ఇంతటి ప్రాధాన్యతను చేనేతకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం శుభసూచకం. అయితే అంతటితో ఊరుకోక చేనేత కార్మికులకు సమగ్ర విధానాన్ని అమలు చేయాల్సిన బాధ్యతా కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అప్పుడే నేతన్నలకు అస లైన నేత దినోత్సవమవుతుంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కార్మికులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ చాలా కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువగానే ఉన్నాయి. ఇరు రాష్ట్రాల్లోనూ చేనేత వృత్తి ఆనవాళ్లు అదృశ్యమ వుతున్నాయి. వారి జీవనం రోజు రోజుకు దయనీ యంగా మారుతోంది. వారసత్వంగా నమ్ముకున్న వృత్తి కూడు పెట్టక కష్టనష్టాలను ఎదుర్కొంటు న్నారు. నైరాశ్యంలో ఉన్న వారికి రెండు తెలుగు ప్రభుత్వాల నుంచి కనీస ఆసరా కరువైంది. ఆద రణ, ప్రోత్సాహం అసలే లేదు. వారి సంక్షేమం ఎండమావిగా మారింది. రెండు రాష్ట్రాల్లోని నేతన్న లను ఆదుకునేందుకు ప్రభుత్వాలు చేపట్టిన పథ కాలు కాగితాలకే పరమితమయ్యాయి. చేనేత సహ కార సంస్థ, సమాఖ్యలు నామమాత్రంగానే మిగి లాయి. ఎన్నికలకు ముందు చంద్రబాబు, చంద్రశే ఖర్‌రావులు ఇద్దరూ చేనేత కార్మకులపై హామీల వర్షం కురిపించారు. తీరా గద్దెనెక్కాక వారిని పట్టిం చుకున్న దాఖలా లేదు. చేనేత వృత్తి కళ్లముందే కుప్పకూలుతున్నా దానిని కాపాడే గట్టి ప్రయత్నాలు చేయడం లేదు. రెండు ప్రభుత్వాల నుంచి చేనేత లకు అందుతున్న సాయం ఏమీ లేదు. దీంతో రాజ కీయ పార్టీలు చేనేతలను ఓటు బ్యాంకులుగా చూస్తున్నారు తప్ప వారి అభ్యున్నతికి పాటుపడటం లేదని మరోసారి రుజువైంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆదినుం చి నేత పని సంప్రదాయ వృత్తిగా ఉండి చేనేతలకు ఉపాధిమార్గం చూపింది. వారి ఆర్థిక అవసరాలకు ప్రాణాధారంగా నిలిచింది. కానీ ప్రస్తుతం పట్టెడ న్నం కూడా పెట్టలేని విధంగా చేనేతరంగం నిరాద రణకు గురైంది. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన ఘనత తెలుగు నేతన్నలది. ఇప్పటికీ విదేశాలకు వెళితే తెలుగు రాష్ట్రాల్లో తయారయ్యే చేనేత వస్త్రాల గురించే చెప్పుకుంటారు. ఇంత ఘనకీర్తిని మన దేశానికి అందిస్తున్న నేతన్నలను కాపాడుకోవడం మన ధర్మం. అయితే ప్రస్తుతం ప్రపంచీకరణ ప్రభా వాలు, పాలకుల విధానాల కారణంగా చేనేతలకు గడ్డుకాలం వచ్చి పడింది. రోజూ నేత పని ఉండకపో వడం, కుటుంబమంతా పగలనకా రేయనకా కష్ట పడి పని చేసిన దానికి తగిన ఆదాయం రాకపో వడం, ఏ విధంగానూ వెసులుబాటు లేనందువల్ల నైరాశ్యం అలముకుంది. కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయడం వాటిని సకాలంలో తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడటం ఎక్కువైంది. మరో ైవైపు చేనేత వృత్తి వల్ల ఫలితం లేదని చాలా మంది ప్రత్యామ్నాయం కోసం వలస వెళుతున్నారు. అన్ని టికన్నా దురదృష్టకర విషయమేమంటే, చేనేత కుటుంబాలలోని అబ్బాయిలకు వివాహాలు కూడా గగనమవుతున్నాయి.
అందువల్ల రెండు తెలుగు ప్రభుత్వాలు నేతన్న లపై ప్రత్యేక దృష్టి సారించాలి. చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. నేతన్నలకు ప్రతి ఏటా నిధులు కేటాయించి రుణాలు ఇవ్వాలి. వారి కోసం సంక్షేమ పథకాలను అమలు చేయాలి. బ్యాం కు రుణాలు అందించే విధానం రూపొందించాలి. వారికి తగిన ప్రోత్సాహం అందించి, ఇతర రాష్ట్రాల తరహాలో నేతన్నల దశ తిరిగేలా చొరవ తీసుకో వాలి. ఆవిధంగా చేనేతకు అన్ని విధాలా చేయూత నందించి చేనేత కుటుంబాల్లో వెలుగు దివ్వెలు ప్రకా శించేలా చేయాలి. అప్పుడే జాతిపిత మహాత్మా గాంధీ ఎంతగానో అభిమానించిన చేనేతకు తగిన గుర్తింపు లభిస్తుంది. అప్పుడే జాతీయ చేనేత దినో త్సవం సార్థకమవుతుంది.
(ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం)
- బి. రామకృష్ణ మొబైల్: 9542206130
చేనేతలకు చేయూత కలేనా?
Published Tue, Aug 4 2015 12:49 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement