ముఖ్యమంత్రికి పాత్రికేయుల కృతజ్ఞతలు | Thanks to the journalists for the Chief Minister | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రికి పాత్రికేయుల కృతజ్ఞతలు

Published Sat, Jun 2 2018 3:04 PM | Last Updated on Sat, Jun 2 2018 3:04 PM

Thanks to the journalists for the Chief Minister - Sakshi

ముఖ్యమంత్రితో పాత్రికేయుల ప్రతినిధి బృందం  

భువనేశ్వర్‌ : రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయుల వర్గం ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో శుక్రవారం భేటీ అయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఈ వర్గం కృతజ్ఞతలు తెలియజేసింది. వర్కింగ్‌ జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరోగ్య బీమా ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలైనట్లు ప్రకటించడంపట్ల ఈ వర్గం హర్షం వ్యక్తం చేసింది. గోపబంధు సంబాధిక్‌ స్వాస్థ్య బీమా యోజన (గోపబంధు పాత్రికేయ ఆరోగ్య బీమా పథకం) పేరుతో ఈ పథకాన్ని ప్రకటించారు.

జిల్లా సమాచార-ప్రజా సంబంధాల అధికారి పాత్రికేయులకు ఆరోగ్య బీమా కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఈ పథకం కింద పాత్రికేయునితో పాటు 5గురు   కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల గరిష్ట పరిమితితో ఆరోగ్య బీమా లభిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement