హెలెన్ తుఫాను తూర్పుగోదావరి జిల్లా మీద తీవ్ర ప్రభావం చూపించింది. ఉప్పాడ కొత్తపల్లి వద్ద కల్వర్టు కొట్టుకుపోయింది. రోడ్డు మొత్తం కోతకు గురైంది.
రాష్ట్ర చరిత్రలో అత్యంత విషాదాంతంగా చెప్పుకునే దివిసీమ ఉప్పెన తరువాత అతి పెద్ద ప్రళయం నవంబరు ఆరు తుపానే. అంతులేని ఆస్తి, ప్రాణ నష్టానికి కారణమైన ఈ తుపాను వచ్చినే నవంబరు నెలంటనే కోనసీమ వాసులు ఇప్పటికీ అందోళన చెందుతుంటారు. సరిగా 17 ఏళ్ల తరువాత ఇదే నెలలో వచ్చిన హెలెన్ తుఫాను తూర్పుగోదావరి జిల్లా మీద తీవ్ర ప్రభావం చూపించింది. ఉప్పాడ కొత్తపల్లి వద్ద కల్వర్టు కొట్టుకుపోయింది. రోడ్డు మొత్తం కోతకు గురైంది. కాకినాడ-ఉప్పాడ మధ్య నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న రాక్ వే మొత్తం ధ్వంసమైంది. అలలు తీవ్రంగా ఎగసిపడుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.