తెలుగు సినీ పరిశ్రమలో ఆదుర్తి సుబ్బారావు పేరు వినని వారుండరు.ఆయన గురించి హెచ్.రమేష్ బాబు ఓ పుస్తకాన్ని రాశారు.ఈ పుస్తకావిష్కరణ హైదరాబాద్లో సోమవారం జరిగింది.తొలి కాపీని కె.విశ్వనాథ్ ఆవిష్కరించి మహేష్ బాబుకు అందజేశారు.ఈ కార్యక్రమంలో కృష్ణ, విజయ నిర్మల, మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్,కె.విశ్వనాథ్, మంజుల, ఆదుర్తి సాయి భాస్కర్ పాల్గొన్నారు.అనంతరం ఆదుర్తి చిత్రపటానికి కృష్ణ పుష్పాంజలి ఘటించారు.