చెన్నై: అన్నా డీఎంకే పార్టీ నుంచి 50మందికిపైగా నాయకులను పార్టీ అధినాయకులు ఒ.పన్నీర్‌సెల్వం, కె.పళనిస్వామిలు బహిష్కరించారు. క్రమశిక్షణ వేటు పడిన 53మంది పార్టీ కాంచీపురం సెంట్రల్ యూనిట్‌కు చెందినవారు. అలాగే పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగానికి చెందిన ఐదుగురు(అన్నా తోజిర్సంగ పెరవై)ని కూడా బహిష్కరించారు. వారిని అన్ని పోస్టుల నుంచి, ప్రాథమిక సభ్యత్వాల నుంచి తొలగించినట్లు కో ఆర్డినేటర్లు పన్నీరుసెల్వం, పళనిస్వామిలు తెలిపారు. పార్టీ నుంచి విడిపోయిన దినకరన్‌కు ప్రధాన శక్తులుగా ఉన్న పలువురిని ఇంతకుముందు కూడా బహిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment