
సాక్షి, తిరుపతి: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటికి వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని అధిగమించనుంది. అలుపెరగని సైనికుడిలా అడుగులు వేస్తున్న జగన్‌కు సంఘీభావంగా ఊరూరా పాదయాత్ర నిర్వహిం చాలని పార్టీ అధిష్టానం నిర్ణయిం చింది. అందులో భాగంగా సోమవారం జిల్లా నేతలు ‘జగనన్నతో కలిసి నడుద్దాం’ పేరుతో పెద్ద ఎత్తున పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో అన్ని వర్గాల ప్రజలతో కలిసి నడవనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నేతలు పూర్తి చేశారు. రాజన్న తనయునికి మద్దతుగా గ్రామస్థాయిలోనూ పాదయాత్ర చేసేందుకు గ్రామీణులు ఉత్సాహం చూపుతున్నారు.