
సాక్షి, పశ్చిమ గోదావరి : టీడీపీ నేతలు పోలవరం ప్రాజెక్టును కేవలం కమిషన్లు దండుకునే ప్రాజెక్టుగానే పరిగణించారని ఆంధప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని విమర్శించారు. గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టులో ఏం జరుగుతుందో తెలియకుండా గత టీడీపీ ప్రభుత్వం జనాన్ని మభ్య పెట్టిందని అన్నారు. కమిషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేపు ప్రాజెక్టును సందర్శించి ఇక్కడి పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment