
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రైతులు, రైతు కూలీలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పేందుకు ప్రగతి నివేదన సభకు తరలివస్తున్న ఖాళీ ట్రాక్టర్లే నిదర్శనమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలకున్న ఏహ్య భావానికి ఈ ఖాళీ ట్రాక్టర్లే సంకేతమని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కచ్చితంగా ఖాళీ అవుతుందని ఈ ఖాళీ ట్రాక్టర్లే చెబుతున్నా యని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment