
సాక్షి, కరీంనగర్ : అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం కొమ్ము కాస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. ఎంఐఎం నేతలు పాత బస్తీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఓవైసీ బ్రదర్స్ తమ ఆస్తులను కాపాడుకునేందుకు ముస్లీంలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.
ఆరెస్సెస్ రామ రాజ్యం కోరుకుంటే ఎంఐఎం ఉగ్రరాజ్యం కోరుకుంటుందని విమర్శించారు. రామ రాజ్యం కావాలో ఉగ్ర రాజ్యం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు. జాతీయ జెండాకు గౌరవ వందనం చేయని వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కరీంనగర్‌లో గంగుల కమలాకర్ తనకు రాజకీయ ప్రత్యర్థే కానీ వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు. గంగుల వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ప్రజలే బుద్ది చెబుతారని సంజయ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment