Owaisi brothers
-
జోరేది?
సాక్షి,సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతోంది. ప్రచారానికి ఇంకా మిగిలింది ఐదు రోజులే. ఈ నెల 9వ తేదీ (మంగళవారం) సాయంత్రం ఐదు గంటలతో ప్రచార పర్వం పరిసమాప్తం చేయాల్సిందే. కానీ ఇంకా ప్రధాన పార్టీ అభ్యర్థుల ప్రచారం జోరందుకోలేదు. ఇప్పటి వరకు లోపాయికారీ ఒప్పందాలు, దాగుడుమూతలు, ఆర్థిక వనరుల సమీకరణ వ్యవహారాలకే అధిక సమయం కేటాయించిన అభ్యర్ధులు.. నామమాత్రంగా ఉదయం రెండు గంటలు, సాయంత్రం మరో రెండు గంటలతో ప్రచారాన్ని సరిపెడుతున్నారు. అందులో కొందరు అభ్యర్థులు పాదయాత్రలు, రోడ్‌షోలు, సభలు, సమావేశాలకు పరిమితమయ్యారు. మరికొందరు మిత్రపక్షాల ముఖ్య నేతలను, ఓటర్లను ప్రభావితం చేసే తటస్థులతో ప్రత్యేకంగా సమావేశమై మద్దతు కోరుతున్నారు. చోటామోటా నాయకులైతే బస్తీల్లో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల నుంచి కొందరు అగ్రనేతలు మాత్రమే గ్రేటర్లో ప్రచారం చేశారు. అగ్రనేతలు ఇలా.. ఇటీవల టీఆర్ఎస్ పక్షాన ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన సభకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కాలేదు. మరోవైపు అభ్యర్థుల పక్షాన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుడిగాలిలా రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో సభల్లో సైతం పాల్గొని ప్రసంగించారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్లలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా మూడు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ నగరంలో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. ప్రధాని పర్యటన గ్రేటర్ కమలనాథుల్లో జోష్ నింపింది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ లోక్‌సభ అభ్యర్థుల పక్షాన ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. కానీ ఆ పార్టీ అభ్యర్థుల తరఫున కొందరు ఢిల్లీ నేతలు నియోజకవర్గ సమావేశాలు, ప్రచారాల్లో పాలుపంచుకుంటున్నారు. మరోవైపు చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా కూడా ప్రచారం చేస్తున్నారు. మజ్లిస్ పార్టీ పక్షాన ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా అసదుద్దీన్ నియోజకవర్గంలో పాదయాత్రలతో ఓట్లను అభ్యర్థిస్తూనే రోజుకో బహిరంగ సభలో పాల్గొంటున్నారు. మరోవైపు మిత్రపక్షమైన టీఆర్ఎస్ మద్దతు గా ఆయా నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. అదేవిధంగా తన పార్టీ పోటీ చేస్తున్న మహారాష్ట్ర, బిహార్ లోక్‌సభ అభ్యర్థుల తరఫున కూడా ఆయన హాజరవుతున్నారు. జనసేన పక్షాన సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థుల తరఫున గురువారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగసభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, బీఎస్సీ అధినేత మాయవవతి పాల్గొని ప్రసంగించారు. -
‘రామ రాజ్యమా..ఉగ్ర రాజ్యమా’
సాక్షి, కరీంనగర్ : అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం కొమ్ము కాస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. ఎంఐఎం నేతలు పాత బస్తీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఓవైసీ బ్రదర్స్ తమ ఆస్తులను కాపాడుకునేందుకు ముస్లీంలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఆరెస్సెస్ రామ రాజ్యం కోరుకుంటే ఎంఐఎం ఉగ్రరాజ్యం కోరుకుంటుందని విమర్శించారు. రామ రాజ్యం కావాలో ఉగ్ర రాజ్యం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు. జాతీయ జెండాకు గౌరవ వందనం చేయని వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కరీంనగర్లో గంగుల కమలాకర్ తనకు రాజకీయ ప్రత్యర్థే కానీ వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు. గంగుల వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ప్రజలే బుద్ది చెబుతారని సంజయ్ పేర్కొన్నారు. -
'ఓవైసీ సోదరులు అలా మాట్లాడడం తగదు'
హైదరాబాద్: హిందువులను కించపరిచేవిధంగా మాట్లాడితే సహించేది లేదని టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఒవైసీ సోదరులు మాట్లాడడం తగదని పేర్కొన్నారు. గతంలో కూడా హిందువులను అవమానించేలా ఓవైసీ సోదరులు మాట్లాడారని గుర్తు చేశారు. అందరూ కలిసివుండాలన్నదే తమ అభిప్రాయమని చెప్పారు. ప్రతి భారతీయుడు ముస్లింగానే పుడుతున్నారని, తర్వాతే మతం మారుతున్నారని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఇటువంటి వారిని 'ఘర్ వాపసీ' ద్వారా మళ్లీ ముస్లింలుగా మార్చాలని అన్నారు. అసదుద్దీన్ వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. -
మజ్లిస్ పార్టీపై శివసేన సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : మజ్లిస్ పార్టీ పైనా ...ఆ పార్టీ అధినేతలు ఒవైసీ సోదరుల పైనా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలతో విరుచుకు పడ్డారు. ఒవైసీ సోదరులిద్దరూ ఛాందస వాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఉద్ధవ్ విమర్శించారు. దేశ వ్యాప్తంగా ముస్లింలో మనసుల్లో ఒవైసీ సోదరులు విషబీజాలు నాటుతున్నారని ఆయన మండి పడ్డారు. మహారాష్ట్రలోని నాందెడ్ మున్సిపల్ ఎన్నికల్లో విజయంతో ఆరంగేట్రం చేసిన మజ్లిస్ పార్టీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రంలో బోణీ కొట్టింది. రెండు స్థానాల్లో మజ్లిస్ విజయ బావుటా ఎగరేసింది.మరో 14 నియోజక వర్గాల్లో రెండు..మూడు స్థానాల్లో నిలిచి తన ఉనికి చాటుకుంది. మజ్లిస్ బలోపేతం కావడం రాజకీయంగా తమకు నష్టమేనని భావిస్తోన్న ఉద్ధవ్ థాకరే... మజ్లిస్‌పై కారాలూ మిరియాలూ నూరుతున్నారు. మజ్లిస్ పార్టీని నిషేధించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రణీతి షిండే డిమాండ్ చేశారంటోన్న ఉద్ధవ్..ప్రజలంతా ఆమె డిమాండ్ కు మద్దతు పలకాలని పిలుపు నిచ్చారు. హిందువులకు అత్యంత ప్రమాదకరమైన శక్తులు ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో తలలు పైకెత్తాయని ఉద్ధవ్ థాకరే మజ్లిస్ విజయాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. -
'తెలంగాణ ప్రభుత్వంలో చేరాలనే ఆసక్తి లేదు'
-
'తెలంగాణ ప్రభుత్వంలో చేరాలనే ఆసక్తి లేదు'
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్రభుత్వంలో చేరాలనే ఆసక్తి తమకు లేదని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీతో పాటు చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఓవైసీ సోదరులు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఓవైసీ సోదరులు మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్ నగర అభివృద్ధే తమ లక్ష్యమన్నారు. రూ. వెయ్యి కోట్లతో భాగ్యనగరం అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు కేసీఆర్‌కు అందజేసినట్లు చెప్పారు. తాము ఆశించిన స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అభివృద్ధి జరగడం లేదని ఓవైసీ ఈ సందర్బంగా ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంలో చార్మినార్ చిహ్నంగా ఉంచాలని కేసీఆర్‌ను కోరినట్లు ఓవైసీ సోదరులు వెల్లడించారు.