
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం బీజేపీ 72 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. యడ్యూరప్పను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇదివరకే ప్రకటించిన బీజేపీ.. షికారిపుర నుంచి ఆయన్ను బరిలోకి దింపింది. పార్టీ కీలక నేతలైన జగదీశ్ షెట్టర్ (హుబ్లీ–ధార్వాడ్ సెంట్రల్), కేఎస్ ఈశ్వరప్ప (షిమోగా), బి. శ్రీరాములు (మొలకల్‌మురు) తదితరులకు ఈ జాబితాలో చోటు దక్కింది. మొత్తం 224 నియోజకవర్గాలకోసం రెండో విడత జాబితాను మరో రెండ్రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఏప్రిల్ 15న ఒకే విడతలో మొత్తం అభ్యర్థుల పేర్లను వెల్లడించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.