
సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ చెబితేనే కియా సంస్థ అనంతపురం జిల్లాలో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో మిత్ర పక్షమైన తెలుగుదేశం పార్టీ బీజేపీపై విమర్శలు చేస్తుండటం ఆశ్చర్యాన్ని కల్గిస్తోందన్నారు.
హోదా రాదని తెలిసి ప్యాకేజీకి ఒప్పుకున్న మీరు, ఇప్పుడు అదే మాట మేము మాట్లాడితే.. దొంగలం, ఏజెంట్లు, కుక్కలం అని అంటారా అని దుయ్యబట్టారు.గ్రాఫిక్ బొమ్మల కోసం రూ. 3,500 కోట్లు, సచివాలయంలో షెడ్డుల ఏర్పాటు కోసం అడుగుకు రూ. 6,500 ప్రకారం గొప్పగా ఖర్చు చేసినా ఆ విషయమై తాము విమర్శించడం లేదని ఎద్దేవా చేశారు. ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి ప్రధాని అయితే ఓర్చుకోరా, కాపు కులానికి చెందిన వీర్రాజు మాట్లాడితే ఒప్పుకోరా, ఒక దళితుడు దారా సాంబయ్యను ఏజెంట్ అంటారా? అని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment