మా ఐకమత్యం మరింత బలపడింది | BJPs Rajya Sabha Gambit Led To Stronger Ties With BSP | Sakshi
Sakshi News home page

మా ఐకమత్యం మరింత బలపడింది

Published Mon, Mar 26 2018 4:45 AM | Last Updated on Mon, Mar 26 2018 4:45 AM

BJPs Rajya Sabha Gambit Led To Stronger Ties With BSP - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రాజ్యసభ సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓ సీటు ఎక్కువ గెలిచిందిగానీ ఆ గెలుపు బీజేపీనే దెబ్బతీస్తుందని యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ దళిత వ్యతిరేక వైఖరి బహిర్గతమైందన్నారు.  ఎస్పీ–బీఎస్పీల ఐకమత్యం బలపడిందన్నారు. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అనిల్‌ అగర్వాల్‌ చేతిలో బీఎస్పీ అభ్యర్థి భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌ త్రుటిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. పేదలకు వ్యతిరేకంగా ధనాన్ని, అధికార వినియోగానికి పాల్పడిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని అఖిలేశ్‌ ఆరోపించారు. తన భార్య, కన్నౌజ్‌ ఎంపీ డింపుల్‌ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోరని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement