మీడియాతో మాట్లాడుతున్న బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు నాలుగేళ్లలో ఎన్నో మాటలు మార్చారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీ నాయకులు కలిసి ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ మొదట్నుంచి ప్రత్యేక హోదా కావాలని అంటుంటే టీడీపీ, బీజేపీ నేతలు వ్యంగ్యంగా మాట్లాడారని గుర్తుచేశారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు తమ దారిలోకి వచ్చినందుకు సంతోషమని, మళ్లీ మాట మార్చకుండా హోదాకు కట్టుబడాలని డిమాండ్ చేశారు.
అప్పుడు ప్యాకేజీ.. ఇప్పుడు హోదా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ నిన్న చేసిన ప్రసంగంలో ప్రత్యేక హోదా ప్రస్తావన ఉండటం పట్ల రాజేంద్రనాథ్‌రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో అంతా బాగుందన్నట్టు గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా గురించి గవర్నర్ మాట్లాడుతూ విభజన హామీలు అమలు కాలేదన్నారు. గతేడాది గవర్నర్ ప్రసంగంలో మాత్రం దేశంలో హోదా అనే అంశం లేదని, దానికి బదులు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ సాధించినట్టు చెప్పార’ని రాజేంద్రనాథ్‌రెడ్డి గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment