
సాక్షి ప్రతినిధి/సాక్షి, శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీని మళ్లీ గెలిపిస్తే ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొస్తానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. తనను అధికారంలోకి తీసుకురావడం కోసం తన పథకాల వల్ల లబ్ధిపొందిన మహిళలు, రైతులు ఏప్రిల్ ఒకటి నుంచి రోడ్డెక్కి ప్రచారం చేయాలని కోరారు. శనివారం శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. శ్రీకాకుళం పట్టణంలో రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. ‘తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పక్కకు పోయినా మీరు (మహిళలు) మాత్రం నా కోసం కష్టపడి ప్రచారం చేయండి. మీ మీద లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నాను. శ్రీకాకుళాన్ని హైదరాబాద్‌గా మారుస్తా’ అని ప్రకటించారు.
కేసీఆర్ ఆంధ్ర వాళ్లను కుక్కలు, నక్కలు అని దూషించారని, ఆ తిట్లకు మీకు రోషం రాలేదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతి, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు పూర్తవడం ఆయనకు ఇష్టం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్, జగన్, మోదీలు మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో రాయలసీమ, పులివెందుల నుంచి అడ్డపంచెలు కట్టుకుని కొంతమంది వస్తారని, మెడలు కోసే వారి పట్ల, రౌడీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. తొలుత ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఐదేళ్ల క్రితం 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే చంద్రబాబు ఈ దఫా కూడా చంద్రబాబు పునరుద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment