మాట్లాడుతున్న కేటీఆర్
సాక్షి, యాదాద్రి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను రాహుల్‌గాంధీ ఎంపిక చేయడం లేదని, చంద్రబాబు నాయుడే కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, రచనలు చేస్తున్నారని మంత్రి కె.తారక రామారావు ధ్వజమెత్తారు. మహాకూటమి రూపంలో మొండి చెయ్యితో కాంగ్రెస్ పార్టీ.. ప్రజల చెవ్వుల పువ్వులు పెట్టడానికి బీజేపీ పార్టీ.. అగ్గిపెట్టె గుర్తుతో పుల్లలు పెట్టడానికి కోదండరాం పార్టీలు వస్తున్నాయని విమర్శించారు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు.. ముసలి నక్క.. గుంట నక్కలు ఏకమై మాయల కూటమి రూపంలో తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ముందుకు వస్తున్నాయని మండిపడ్డారు.
ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని యాదగిరిపల్లిలో నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ‘నోట్ల కట్టలకు ఆశపడి ఇజ్జత్ తక్కువ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో దోస్తీ కట్టి ఇక్కడి రైతాంగాన్ని నాశనం చేయడానికి వస్తున్నారు. కానీ, తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసి కర్రు కాల్చి వాతలు పెడతారు. కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లు.. నోట్ల కోసం చంద్రబాబుకు దాసోç ßæం అవుతున్నారు’అని మంత్రి విమర్శించారు. సబ్బండ వర్గాలను కారులో ఎక్కించుకుని నడుపుతు న్న డ్రైవర్ మారొద్దు.. కారు ఆగొద్దు..ప్రగతి రథచక్రం ముందుకు సాగాలంటే 100 సీట్లు గెలిపించుకోవాలన్నారు. 2014లో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పేద ప్రజల ముఖంలో చిరునవ్వు వచ్చిందని, ఆ చిరునవ్వు అలాగే కొనసాగాలంటే మరోసారి టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకురావాలన్నారు.
నేనొస్తా సర్కార్ దవాఖానకు..
ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే పేద ప్రజలు ‘నేను రానామ్మో సర్కార్ దవాఖానాకు’అన్న మాటలకు నేడు ‘నేనొస్తా అమ్మా సర్కార్ దవాఖానాకు’అనే నినాదంకు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కేటీఆర్ అన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ తిరుపతికి ధీటుగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు 30 ఉత్తరాలను కేంద్రానికి పంపారన్నారు. ఈ సభలో భువనగిరి, నల్లగొండ లోక్‌సభ సభ్యులు డాక్టర్ బూరనర్సయ్యగౌడ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యు లు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, కర్నెప్రభాకర్, మందుల సామేల్, గొంగిడి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment