కేంద్ర మంత్రి సుజానా చౌదరీ (ఫైల్ ఫోటో)
ఢిల్లీ: జమిలి ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని అడిగి టీడీపీ వైఖరి చెబుతామని కేంద్ర మంత్రి సుజానా చౌదరీ తెలిపారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో ఎన్డీఏ పక్ష నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ తరపున కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ తోట నరసింహం పాల్గొన్నారు. సమావేశం అనంతరం సుజానా చౌదరీ విలేకరులతో మాట్లాడుతూ..దేశ ఆర్ధిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల గురించి ఎన్డీఏ పక్ష సమావేశం లో చర్చించామని చెప్పారు. జమిలి ఎన్నికలపై సలహాలు అడిగారని, ఆ విషయం గురించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో సంప్రదించి చెబుతామన్నారు.
విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై భారత ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి చర్చించాల్సిన అంశాలున్నాయన్నారు. అమిత్ షా సమయం ఇచ్చాక కలిసి విభజన అంశాలు చర్చిస్తామని చెప్పారు. మిత్రపక్ష ధర్మాన్ని ఎలా పాటించడంపై అమిత్ షాతో చర్చిస్తామన్నారు. సంయమనంతో ఉండమని టీడీపీ నాయకులకు చంద్రబాబు సూచించారని, బీజేపీ నాయకులకు కూడా వారి అధిష్టానం సూచించాలని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment