సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల తాగునీటి పథకాలు మూసివేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిధుల కొరత పేరుతో రూ.3 లక్షల కోట్లు అప్పు తెచ్చారన్నారు. స్కామ్ ల కోసమే స్కీమ్ లు రూపొందిస్తున్నారని విమర్శించారు. ‘కేంద్ర మంత్రులు రావడం.. పొగడటం.. బీజేపీ లక్ష్మణ్ స్కామ్ అని తిట్టడం... మీ ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం ఏమిటని’ ప్రశ్నించారు. రాష్ట్రంలో రెవెన్యూ కార్యాలయాలు పనిచేయడం లేదని..పాలన దారి తప్పిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతుందన్నారు. కాళేశ్వరం, సీతారాముల ప్రాజెక్టులు పనులపై కూడా సీబీఐ విచారణ జరపాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment