
కరీంనగర్: బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్‌ఎఫ్) రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కన్వీ నర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. కరీంనగర్‌లో గురువారం ఆయన మాట్లాడారు. కేసీఆర్‌పై బీఎల్‌ఎఫ్ నుంచి ప్రజాగాయకుడు గద్దర్‌ను బరిలో దింపు తామన్నారు.
శాసనసభను రద్దు చేస్తూ.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం సరికాదన్నారు. ఈ ఎన్నికల్లో 60 అసెంబ్లీ స్థానాలు బీసీలకు అప్పగిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్‌తో జట్టు కడతామనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో చర్చలు ఉంటాయని, వారం రోజుల్లో స్పష్టత రానుందని ఆయన వివరించారు.