
సాక్షి, న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం భార్య మెహజబిన్ షేక్ గత ఏడాది తన తండ్రిని కలుసుకునేందుకు ముంబయి వచ్చి వెళితే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేస్తోందని కాంగ్రెస్ నిలదీసింది. దావూద్ భార్య దేశానికి వచ్చి దర్జాగా తిరిగివెళుతుంటే మోదీ ప్రభుత్వం నిద్రపోతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా విమర్శించారు. దావూద్ సోదరుడు ఇక్బాల్ ఇబ్రహీం పోలీసుల విచారణలో తమ వదిన మెహజబీన్ షేక్ 2016లో తన తండ్రి సలీం కశ్మీరీని కలిసేందుకు ముంబయి వచ్చారని వెల్లడించిన నేపథ్యంలో సుర్జీవాలా ఈ వ్యాఖ్యలు చేశారు.
దావూద్ భార్య దేశానికి వస్తే సీబీఐ ఏం చేస్తున్నట్టు..? నిఘా విభాగం ‘రా’ ఏం చేస్తోంది..? అంటూ సుర్జీవాలా ప్రశ్నించారు. దీనిపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి, హోంమంత్రి సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.