davood ibrahim
-
చిత్ర పరిశ్రమపై దావూద్ కి ఆసక్తి తగ్గలేదా?
-
ఆ నలుగురు
న్యూఢిల్లీ: జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంలను వ్యక్తిగత హోదాలో ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) సవరణ చట్టం(యూఏపీఏ)–1967కు కీలక సవరణలకు పార్లమెంటు ఆమోదం తెలిపిన ఒక నెలలోనే ఈ నలుగురిని కొత్త చట్టం కింద ఉగ్రవాదులుగా ప్రకటించినట్లు కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటివరకు యూఏపీఏ కింద చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సంస్థలనే ఉగ్రవాదులుగా ప్రకటించేవారు. కానీ కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం వ్యక్తుల్ని సైతం ఉగ్రవాదులుగా ప్రకటించే వెసులుబాటు ఉంది. ఈ చట్టం కింద ఉగ్రవాదుల్ని ప్రకటించడం ఇదే మొదటిసారి. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వీరిని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. -
దావూద్ ఇబ్రహీంతో ఫోన్లో మాట్లాడా
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో తాను ఫోన్లో మాట్లాడినట్టు ఆయన తమ్ముడు ఇక్బాల్ కస్కర్ చెప్పాడు. అరెస్ట్‌కు ముందు దావూద్‌తో ఫోన్లో మాట్లాడినట్టు థానే కోర్టులో ఇక్బాల్ ఒప్పుకున్నాడు. వెంటనే ఇబ్రహీం ఎక్కడున్నాడని, అతని ఫోన్ నెంబర్ ఏంటని జడ్జి ప్రశ్నించగా.. మొబైల్ నెంబరు డిస్ప్లే కాలేదని, అతడెక్కడున్నదీ తాను తెలుసుకోలేకపోయానని న్యాయమూర్తికి తెలిపాడు. దోపిడీ కేసు విచారణలో భాగంగా కస్కర్‌ను థానె పోలీసులు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆర్వీ థమదేకర్ ఎదుట హాజరు పరిచారు. ఈ కేసు విచారణ క్రమంలో దావూద్‌తో మాట్లాడిన విషయాన్ని కస్కర్ ఒప్పుకున్నాడు. దావూద్ ఇబ్రహీం గతంలో లొంగిపోయేందుకు సిద్ధమయ్యాడని, అప్పుడు మధ్యవర్తిగా రామ్ జెఠ్మలానీ వ్యవహరించాలని కస్కర్ తరుఫు న్యాయవాది శ్యాం కేస్వాని చెప్పారు. కానీ కొన్ని షరతులు వర్తిస్తాయంటూ తన తరఫు న్యాయవాది ద్వారా ప్రభుత్వానికి తెలియజేశాడని, కేసు విచారణ సమయంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అర్థర్ రోడ్ జైలులో తనను ఉంచుతానంటేనే లొంగిపోతానని దావూద్ తెలియజేసినట్టు శ్యామ్ కేశ్వాని పేర్కొన్నారు. ఈ షరతులకు ప్రభుత్వం నిరాకరించిందని, దావూద్‌ను అరెస్ట్ చేయలేదని తెలిపారు. దీంతో దావూద్ ఇబ్రహీం లొంగిపోలేదని చెప్పారు. దావూద్ సోదరుడు కస్కర్‌పై, ఆయన గ్యాంగ్ సభ్యులపై దోపిడీ కేసు నమోదైంది. శ్యాం సుందర్ అగర్వాల్ అనే వ్యక్తి బోరివల్లిలో ప్లాట్ కొనుగోలు చేశాడు. అయితే ఈ ప్లాట్ విషయంలో కస్కర్, అగర్వాల్‌ను బెదిరించాడు. ఆ ప్లాట్‌ను బలవంతంగా మరో వ్యక్తికి బదిలీ చేయించాడు. ప్రస్తుతం డయాబెటిస్ వల్ల కాలుకు కలిగిన గాయంతో కస్కర్‌కు మెడికల్ చికిత్స అవసరమని శ్యాం కేస్వాని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత సివిల్ ఆసుపత్రిలో అతనికి పోలీసులు చికిత్స అందించాలని, మార్చి 9 వరకు కస్కర్ కస్టడీ కొనసాగుతుందని జడ్జి తెలిపారు. -
‘మొద్దునిద్రలో మోదీ సర్కార్’
సాక్షి, న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం భార్య మెహజబిన్ షేక్ గత ఏడాది తన తండ్రిని కలుసుకునేందుకు ముంబయి వచ్చి వెళితే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేస్తోందని కాంగ్రెస్ నిలదీసింది. దావూద్ భార్య దేశానికి వచ్చి దర్జాగా తిరిగివెళుతుంటే మోదీ ప్రభుత్వం నిద్రపోతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా విమర్శించారు. దావూద్ సోదరుడు ఇక్బాల్ ఇబ్రహీం పోలీసుల విచారణలో తమ వదిన మెహజబీన్ షేక్ 2016లో తన తండ్రి సలీం కశ్మీరీని కలిసేందుకు ముంబయి వచ్చారని వెల్లడించిన నేపథ్యంలో సుర్జీవాలా ఈ వ్యాఖ్యలు చేశారు. దావూద్ భార్య దేశానికి వస్తే సీబీఐ ఏం చేస్తున్నట్టు..? నిఘా విభాగం ‘రా’ ఏం చేస్తోంది..? అంటూ సుర్జీవాలా ప్రశ్నించారు. దీనిపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి, హోంమంత్రి సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘త్వరలో ఇండియాకు మాఫియా డాన్’
-
‘త్వరలో ఇండియాకు మాఫియా డాన్’
సాక్షి,ముంబయిః మహారాష్ర్ట నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో బీజేపీ ప్రభుత్వం మంతనాలు జరుపుతున్నదని అన్నారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న దావూద్ భారత్‌కు రావాలని అనుకుంటున్నారని, ఇక్కడే తుదిశ్వాస విడవాలని భావిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. దావూద్‌ను తాము దేశానికి రప్పించామని ప్రచారం చేసుకునేందుకు బీజేపీ తహతహలాడుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఈ అంశాన్ని వాడుకునేందుకు బీజేపి ప్రయత్నిస్తుందని విమర్శించారు. తన అధికారిక ఫేస్బుక్ పేజీ ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో థాకరే ఈ వ్యాఖ్యలు చేశారు. -
దావూద్‌కి కుచ్చుటోపీ పెట్టిన అనుచరుడు