‘త్వరలో ఇండియాకు మాఫియా డాన్’
సాక్షి,ముంబయిః మహారాష్ర్ట నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో బీజేపీ ప్రభుత్వం మంతనాలు జరుపుతున్నదని అన్నారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న దావూద్ భారత్‌కు రావాలని అనుకుంటున్నారని, ఇక్కడే తుదిశ్వాస విడవాలని భావిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు.
దావూద్‌ను తాము దేశానికి రప్పించామని ప్రచారం చేసుకునేందుకు బీజేపీ తహతహలాడుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఈ అంశాన్ని వాడుకునేందుకు బీజేపి ప్రయత్నిస్తుందని విమర్శించారు. తన అధికారిక ఫేస్‌బుక్ పేజీ ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో థాకరే ఈ వ్యాఖ్యలు చేశారు.