‘నటులు సీఎం కాలేరు.!’ | Congress State President Thirunavukkarasar Talk About Present Politics | Sakshi
Sakshi News home page

‘నటులు సీఎం కాలేరు.!’

Published Wed, Jun 13 2018 7:22 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress State President Thirunavukkarasar Talk About Present Politics - Sakshi

తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌

సాక్షి, చెన్నై‌: సినీరంగంలో ఉన్నవారంతా ముఖ్యమంత్రులు కాలేరని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ తెలిపారు. నాగపట్నం జల్లా వేదారణ్యంలో మంగళవారం తిరునావుక్కరసర్‌ మాట్లాడుతూ కావేరి మేనేజ్‌మెంట్‌ కమిషన్‌లో కర్నాటక సభ్యుడిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని, జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే పరిస్థితి సరిగా లేదన్నారు. ఓపీఎస్, ఈపీఎస్‌ జట్లు అధికారం ఉన్నంత వరకు మాత్రమేనని, ప్రస్తుతం దివాకరన్, దినకరన్‌ పార్టీలు కూడా కొత్తగా బయలుదేరినట్లు తెలిపారు.

అందరూ అన్నాడీఎంకేను రూపొందించిన ఎంజీఆర్‌ను విస్మరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు నేతలందరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో కామరాజర్‌ పాలనను మళ్లీ తీసుకురావాలని కోరారు. మోదీ అనేక అబద్ధాలు చెప్పి అధికారం చేపట్టారన్నారు. ఆయన అబద్ధాలను నమ్మిన ప్రజలు ఓట్లు వేసి మోసపోయినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మోదీ తర్వాత స్థిరమైన పాలన అందజేసే వ్యక్తి రాహుల్‌ గాంధీ మాత్రమేనన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement