Thirunavukkarasar
-
‘నటులు సీఎం కాలేరు.!’
సాక్షి, చెన్నై: సినీరంగంలో ఉన్నవారంతా ముఖ్యమంత్రులు కాలేరని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ తెలిపారు. నాగపట్నం జల్లా వేదారణ్యంలో మంగళవారం తిరునావుక్కరసర్ మాట్లాడుతూ కావేరి మేనేజ్మెంట్ కమిషన్‌లో కర్నాటక సభ్యుడిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని, జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే పరిస్థితి సరిగా లేదన్నారు. ఓపీఎస్, ఈపీఎస్ జట్లు అధికారం ఉన్నంత వరకు మాత్రమేనని, ప్రస్తుతం దివాకరన్, దినకరన్ పార్టీలు కూడా కొత్తగా బయలుదేరినట్లు తెలిపారు. అందరూ అన్నాడీఎంకేను రూపొందించిన ఎంజీఆర్‌ను విస్మరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు నేతలందరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో కామరాజర్ పాలనను మళ్లీ తీసుకురావాలని కోరారు. మోదీ అనేక అబద్ధాలు చెప్పి అధికారం చేపట్టారన్నారు. ఆయన అబద్ధాలను నమ్మిన ప్రజలు ఓట్లు వేసి మోసపోయినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మోదీ తర్వాత స్థిరమైన పాలన అందజేసే వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమేనన్నారు. -
జల్లికట్టుకు చట్ట సవరణ తేవాలి
తిరునావుక్కరసర్ టీనగర్: జల్లికట్టు నిర్వహిం చేందుకు తగిన చట్ట సవరణ చేయాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ తెలిపారు. ఆయ న మధురైలో శుక్రవారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. పెద్ద నోట్లు చెల్లవని ప్రకటించడంతో ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నట్లు తెలిపారు. 28వ తేదీన డీఎంకే తలపెట్టనున్న ఆందోళనలో కాంగ్రెస్ కూడా పాలుపంచుకుంటుందన్నా రు. జల్లికట్లు నిర్వహణకు సంబంధించి తగిన చట్ట సవరణ చేయాలని, రాష్ట్ర ఎంపీలు సమైక్యంగా తీర్మానం చేసి దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరారు. వ చ్చే ఏడాది పొంగల్ పండుగ సమయంలో జల్లికట్టు జరి పేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.జల్లికట్టుపై ఆందోళన: స్టాలిన్: జల్లికట్టు నిర్వహించాలని కోరుతూ డీఎంకే ఆధ్వర్యంలో ఆందోళన జరుపనున్నట్లు కోశాధికారి ఎంకే స్టాలిన్ తెలిపారు. చెన్నై విమానాశ్రయంలో స్టాలిన్ మాట్లాడుతూ ఈ ఏడాది జల్లికట్టు నిర్వహించేందుకు తగిన పరిస్థితులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించనందున దీనిపై కరుణానిధి అనుమతితో ఆందోళన జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
మళ్లీ రచ్చకెక్కిన కుష్భు...
► కాంగ్రెస్‌లో కుష్భు చర్చ ► ఆమె వ్యక్తిగతమన్న తిరునావుక్కరసర్ ► ఆహ్వానించిన తమిళి సై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో, వివాదాలు కొని తెచ్చుకోవడం, చర్చల్లోకి ఎక్కడం సినీ నటి,కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బుకు కొత్తమీ కాదు. తాజాగా దేశ వ్యాప్తంగా మైనారిటీ సంఘాలు, పార్టీలు, కాంగ్రెస్‌తో పాటుగా కొన్ని ప్రతి పక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్న అంశంలోకి తలదూర్చి రచ్చకెక్కారు. సాక్షి, చెన్నై: యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ- ఉమ్మడి పౌరసృ్మతి)కి కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్భు మద్దతు పలికారు. అయితే అత్యవసరంగా ఆ చట్టం తీసుకురావడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. కుష్భు వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో చర్చకు దారి తీశాయి. ఆమె వ్యక్తిగత అభిప్రాయమే గానీ, పార్టీతో సంబంధం లేదని టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ దాట వేశారు. ఆమె వ్యాఖ్యల్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ ఆహ్వానించారు. దేశంలోని వివాహ వ్యవస్థలో ఉమ్మడి పౌరసృ్మతిని ప్రవేశ పెట్టేందుకు కేంద్రం చర్యల్ని వేగవంతం చేసి ఉన్న విషయం తెలిసిందే. ట్రిపుల్ తలాక్‌ను ఇక దేశం నుంచి సాగనంపినట్టే అన్నట్టుగా కేంద్రంలోని పాలకుల వ్యాఖ్యలు దేశంలోని మైనారిటీల్లో ఆక్రోశాన్ని రగిల్చి ఉన్నాయి. ముస్లిం వ్యక్తిగత చట్టాలను సమీక్షించి, వివాహం, విడాకుల విషయంలో ప్రత్యేక నిబంధనల్ని అమలు చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదన్న ఆగ్రహం బయల్దేరింది. కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా తమిళనాడులోని వివిధ పార్టీల్లో ఉన్న మైనారిటీ సంఘాల నాయకులు, పలు మైనారిటీ పార్టీలు ఏకమై ఉద్యమించే పనిలో పడ్డాయి. ఈ పరిస్థితుల్లో కుష్భు యూసీసీకి మద్దతుగా స్పందించడం ఆ సంఘాలకు పుండుమీద కారం చల్లినట్టు అయింది. కాంగ్రెస్ వర్గాలు అయోమయంలో పడ్డాయి. పార్టీలో చర్చకు దారి తీయడంతో ఢిల్లీ వరకు పయనించే అవకాశాలు ఎక్కువే. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూసీసీకి మద్దతు ఇచ్చినట్టు ఇచ్చిన కుష్భు, అమల్లో అంత అవసరం ఎందుకో అని కేంద్రాన్ని ప్రశ్నించడం గమనార్హం. మీడియా ముందు వెల్లడి ఓ మీడియాతో కుష్భు మాట్లాడుతూ, ప్రపంచంలో అనేక దేశాలు యూసీసీని అమల్లోకి తెచ్చినట్టు వివరించారు. అన్ని మతాలకు వ్యక్తిగత చట్టాలు ఉంటాయని, కాలానుగుణంగా మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా కొత్త చట్టాలు తీసుకురావాలని, స్వతంత్రంగా మహిళలు ముందుకు సాగే పరిస్థితుల్ని కల్పించాలని సూచించారు. ఇందుకు తగ్గట్టుగా కేంద్రం తీసుకుంటున్న చర్యల్ని సమర్థిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. యూసీసీని తాను ఆహ్వానిస్తున్నానని, మద్దతు పలుకుతున్నట్టు స్పందించారు. అయితే ఆగమేఘాలపై చట్టం తీసుకురావాల్సిన అవసరం కేంద్రానికి ఎందుకో అని ప్రశ్నించారు. అన్ని మతాల పెద్దల్ని ఒక చోట కూర్చొబెట్టి, అందుకు తగ్గ చర్చ, సమీక్షల అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలే గానీ, ఇలా ఆగమేఘాలపై చట్టం తీసుకు వచ్చేందుకు ఉరకలు తీయడాన్ని ఖండిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ తాజా చర్యలను చూస్తుంటే, కేవలం యూపీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని సాగిస్తున్నట్టుందని విమర్శించారు. యూసీసీకి తాను మద్దతు అని కుష్భు స్పందించడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చ బయలుదేరింది. ఈ విషయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ను ప్రశ్నించగా, ఆమె వ్యక్తిగత అభిప్రాయమే గానీ, పార్టీ నిర్ణయం కాదంటూ దాట వేశారు. ఇక, వీసీకే నేత తిరుమావళవన్ స్పందిస్తూ, కుష్భు అవగాహన లోపంతో స్పందించి ఉన్నారని విమర్శించారు. మైనారిటీ సంఘాలు, పార్టీల నా యకులు కుష్భు వ్యాఖ్యల్ని ఖండించే పనిలో పడ్డారు. అయితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ కుష్భుకు మద్దతుగా నిలిచారు. మైనారిటీ సామాజిక వర్గం నుంచి వచ్చిన కుష్భు యూసీసీకి మద్దతుగా స్పందించడం ఆహ్వానిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. -
కొత్త పలకరింపు
చెన్నై : తమిళనాడు కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు తిరునావుక్కరసర్ డీఎండీకే కార్యాలయం మెట్లు ఎక్కారు. ఆ పార్టీ అధినేత విజయకాంత్‌తో ఆదివారం భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజకీయచర్చ సాగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ వైపునకు డీఎండీకేను తిప్పుకుని డీఎంకేతో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేసిందని చెప్పవచ్చు. అయితే, మెట్టు దిగని విజయకాంత్ ప్రజా సంక్షేమ కూటమిలో చేరి డిపాజిట్లనే కాదు, పార్టీ పరంగా తీవ్ర కష్ట నష్టాల్ని చవిచూడాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాతాళంలోకి నెట్టబడ్డ విజయకాంత్ స్థానిక ఎన్నికలతో బలాన్ని చాటుకునేందుకు తీవ్ర కుస్తీలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ డీఎండీకే కార్యాలయానికి వెళ్లడం ప్రాధాన్యత చోటు చేసుకుంది. గత వారం స్టాలిన్‌కు వ్యతిరేకంగా తిరునావుక్కరసర్ స్పందించిన తీరు డీఎంకే వర్గాల్లో ఆక్రోశాన్ని రగిల్చి ఉన్న విషయం తెలిసిందే. మళ్లీ డీఎంకేకు అనుకూలంగా తిరునావుక్కరసర్ స్పందించే యత్నం చేస్తున్నా, డీఎంకే వర్గాలు మాత్రం కాంగ్రెస్‌కు స్థానికంలో చెక్ పెట్టాలన్న వ్యూహంతో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అన్నాడీఎంకేకు అనుకూలంగా స్పందించిన కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి గుణపాఠం చెప్పే దిశలో స్థానిక సీట్ల బేరాల్లో పొమ్మని పొగ బెట్టే విధంగా వ్యవహరించాలని అధిష్టానంపై పలువురు డీఎంకే నాయకులు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో తిరునావుక్కరసర్ డీఎండీకే అధినేత విజయకాంత్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నట్టు అయింది. తమ భేటీలో స్థానిక చర్చ సాగినట్టు తిరునావుక్కరసర్ వ్యాఖ్యానించడం గమనార్హం. డీఎంకే పక్కన పెట్టిన పక్షంలో డీఎండీకేతో కలసి పయనించేందుకు తగ్గట్టుగా స్థానిక చర్చ సాగి ఉంటుందేమో అన్న ప్రచారం ఊపందుకోవడం ఆలోచించదగ్గ విషయమే.కొత్త పలకరింపు : కొత్త అధ్యక్షుడు తిరునావుక్కరసర్ కోయంబేడులోని డీఎండీకే కార్యాలయం మెట్లు ఎక్కారు. ఆయన వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి చిరంజీవి కూడా ఉన్నారు. తమ కార్యాలయానికి చేరుకున్న తిరునావుక్కరసర్‌కు డీఎండీకే అధినేత విజయకాంత్, యువజన నేత సుదీష్ ఆహ్వానం పలికారు. మర్యాద పూర్వక పలకరింపుల్లో రాజకీయ, స్థానిక చర్చ సాగి ఉండడం గమనార్హం. మీడియాతో తిరునావుక్కరసర్ మాట్లాడుతూ విజయకాంత్‌తో భేటీలో ప్రస్తుత రాజకీయ అంశాలపై మాట్లాడుకున్నామని, స్థానిక ఎన్నికలపై చర్చించుకున్నామని స్పందించారు. విజయకాంత్ తనకు మిత్రుడు అని, ఆయన్ను మర్యాద పూర్వకంగా పలకరించేందుకు వచ్చానని వ్యాఖ్యానించారు. -
మిత్రబంధం!
చెన్నై: టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ రజనీకాంత్‌ను ఆయన నివాసంలో కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరునావుక్కరసు, రజనీకాంత్‌ల మధ్య మంచి స్నేహబంధం ఉందట. ఇది మిత్రబంధమేనని ఎలాంటి రాజకీయాలకు తావు లేదని తిరునావుక్కరసర్ స్పష్టం చేశారు. -
రాహుల్‌ను ప్రధానిని చేద్దాం
పార్లమెంటు స్థానాలన్నీ గెలుచుకోవాలి తమిళ కాంగ్రెస్ నేతలకు రఘువీరారెడ్డి పిలుపు టీఎన్‌సీసీ అధ్యక్షులు తిరునావుక్కరసర్‌కు శుభాకాంక్షలు చెన్నై: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాలు గెలుచుకోవడం ద్వారా అఖిల భారత కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీని ప్రధాని చేద్దామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) కేంద్ర కార్యాలయమైన చెన్నైలోని సత్యమూర్తి భవన్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మంగళవారం ప్రసంగించారు. 2019 నాటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయమే లక్ష్యంగా కార్యకర్తలు నేటి నుంచే కార్యోన్ముఖులు కావాలని ఆయన కోరారు. దేశంలోని యువత అంతా రాహుల్‌గాంధీ నాయకత్వం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నదని అన్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. లౌకికవాదంతో ఏకంగా ఉన్న భారతదేశాన్ని కుల, మతాలు, మతతత్వవాదాలతో బీజేపీ ప్రభుత్వం విడగొడుతున్నదని ఆయన ఆరోపించారు. దేశ సమైక్యత కోసం కాంగ్రెస్ గెలుపు అనివార్యమని ఆయన చెప్పారు. సమర్థ నేత తిరునావుక్కరసర్: టీఎన్‌సీసీ అధ్యక్షులుగా నియమితులైన తిరునావుక్కరసర్ సమర్థుడైన నేత అని రఘువీరారెడ్డి కొనియాడారు. రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల అనుభవమున్న నేతను టీఎన్‌సీసీ అధ్యక్షులుగా నియమించడం సోనియా, రాహుల్‌గాంధీ తీసుకున్న సముచితమైన నిర్ణయమని అన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా గతంలో పలు బాధ్యతలు నిర్వర్తించిన తిరునావుక్కరసర్ హయాంలో తమిళనాడు కాంగ్రెస్ ఘన విజయాలను అందుకుంటుందన్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు. ఏపీ ఇన్చార్జ్గా, ఏఐసీసీ కార్యదర్శిగా తనకు సుపరిచితుడని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో సరైన సలహాలు ఇచ్చి చేదోడువాదోడుగా నిలిచిన సంగతిని తాను మరువలేదని అన్నారు. అందుకే ఆయన్ను స్వయంగా కలసి అభినందించాలని చెన్నైకి వచ్చానని వివరించారు. నిర్బంధ తమిళం కూడదు: తమిళనాడులోని నిర్బంధ తమిళ చట్టంపై రఘువీరా రెడ్డి స్పందిస్తూ, భారతదేశ పౌరులను పలానా భాష నేర్చుకోవాలని నిర్బంధించడం ఎంతమాత్రం కూడదని అన్నారు. తమకు ఇష్టమైన భాషను నేర్చుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కని చెప్పారు. తమిళ కాంగ్రెస్ పార్టీలో 20 శాతం తెలుగువారేనని, రాష్ట్రేతర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారి హక్కులను కాపాడేందుకు కేంద్రం, ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. సమావేశంలో ఏఐసీసీ సభ్యులు చిరంజీవి పాల్గొన్నారు.