జల్లికట్టు నిర్వహిం చేందుకు తగిన చట్ట సవరణ చేయాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ తెలిపారు
తిరునావుక్కరసర్
టీనగర్: జల్లికట్టు నిర్వహిం చేందుకు తగిన చట్ట సవరణ చేయాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ తెలిపారు. ఆయ న మధురైలో శుక్రవారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. పెద్ద నోట్లు చెల్లవని ప్రకటించడంతో ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నట్లు తెలిపారు. 28వ తేదీన డీఎంకే తలపెట్టనున్న ఆందోళనలో కాంగ్రెస్ కూడా పాలుపంచుకుంటుందన్నా రు. జల్లికట్లు నిర్వహణకు సంబంధించి తగిన చట్ట సవరణ చేయాలని, రాష్ట్ర ఎంపీలు సమైక్యంగా తీర్మానం చేసి దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరారు.
వ చ్చే ఏడాది పొంగల్ పండుగ సమయంలో జల్లికట్టు జరి పేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.జల్లికట్టుపై ఆందోళన: స్టాలిన్: జల్లికట్టు నిర్వహించాలని కోరుతూ డీఎంకే ఆధ్వర్యంలో ఆందోళన జరుపనున్నట్లు కోశాధికారి ఎంకే స్టాలిన్ తెలిపారు. చెన్నై విమానాశ్రయంలో స్టాలిన్ మాట్లాడుతూ ఈ ఏడాది జల్లికట్టు నిర్వహించేందుకు తగిన పరిస్థితులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించనందున దీనిపై కరుణానిధి అనుమతితో ఆందోళన జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.