సాక్షి, గుంటూరు : 12 మందిని ఎన్‌కౌంటర్లో చంపించిన వ్యక్తిని హోం మినిస్టర్ చేయడం నిజంగా దురదృష్టం అన్నారు సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమిత్ షా 12 మందిని ఎన్‌కౌంటర్లో చంపించారన్నారు. ఆయనపై 4 క్రిమినల్ కేసులున్నాయని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని హోం మినిస్టర్‌ని చేయడం నిజంగా దురదృష్టకరం అన్నారు. బీజేపీలో 57 మంది మంత్రలు ఉంటే వారిలో 52 మంది కోటీశ్వరులే అని ఆరోపించారు. హోం మినిస్టర్‌తో సహా 26 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయన్నారు. వీళ్లా దేశాన్ని పాలించేది అంటూ నారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాంతీయ పార్టీలతో బీజేపీ అప్రమత్తంగా ఉండాలని నారాయణ హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఈవీఎంలను తొలగించాయన్నారు. మన దేశంలో కూడా వీటిని తొలగించి బ్యాలెట్ పద్దతి ద్వారా ఎన్నికలు జరపాలని నారాయణ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment