
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలతో పాటు తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం సమీక్షించింది. తెలంగాణలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల సంసిద్ధత స్థాయిని తెలుసుకునేందుకు ఈనెల 11న హైదరాబాద్‌లో పర్యటించిన సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేశ్‌సిన్హా నేతృత్వంలోని బృందం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టు సమాచారం. సంసిద్ధతస్థాయిపై ఈ బృందం సానుకూల నివేదిక ఇచ్చిందని, అక్టోబర్ మొదటి వారంలో ఈ బృందం మరోసారి రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment