షిల్లాంగ్ : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మేఘాలయలో కాంగ్రెస్ పార్టీకి ...సొంత ఎమ్మెల్యేలే గట్టి షాక్ ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో ఉపముఖ్యమంత్రి రోవెల్ లింగోడ్ కూడా ఉన్నారు. అలాగే వీరితో పాటుగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. మొత్తం 60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీలో కాంగ్రెస్కు 30 మంది సభ్యులు ఉండగా, వారిలో అయిదుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి రాజీనామాలు చేయడం చర్చనీయాంశమైంది. వీరంతా తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్ కు సమర్పించారు.
ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పిఎన్ సయ్యం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ మరో ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామాలతో కాంగ్రెస్ బలం 24కు పడిపోయింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అందరూ వచ్చేవారం నేషనల్ పీపుల్స్ పార్టీలో చేరనున్నారు. కాగా మేఘాలయ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది మార్చి 6లో మగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment