MLAs resign
-
మరో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో కాంగ్రెస్– డీఎంకేల అధికార కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి సర్కారుకు ఇద్దరు అధికార పక్ష ఎమ్మెల్యేల రాజీనామా రూపంలో మరో సమస్య ఎదురైంది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న బలపరీక్షపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా, ఆదివారం కాంగ్రెస్ ఎమ్మెల్యే కే లక్ష్మి నారాయణ, డీఎంకే ఎమ్మెల్యే వెంకటేశన్ తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను స్వయంగా స్పీకర్ వీపీ శివకొలుందుకు అందజేశారు. ఈ రాజీనామాలతో అధికార పక్షం బలం ఒక ఇండిపెండెంట్ సభ్యుడితో కలుపుకుని 12కి చేరింది. తమకు మద్దతిస్తున్న నామినేటెడ్ సభ్యులు ముగ్గురితో కలుపుకుని విపక్ష సభ్యుల సంఖ్య 14గా ఉంది. మొత్తం 33(ముగ్గురు నామినేటెడ్ సభ్యులు కలుపుకుని) మంది సభ్యుల అసెంబ్లీలో ఏడు ఖాళీలున్నాయి. ఈ నేపథ్యంలో బలపరీక్షపై సీఎం నారాయణస్వామి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తిగా మారింది. బలపరీక్ష సందర్భంగా ఓటు వేసే హక్కు నామినేటెడ్ సభ్యులకు ఉంటుందా? ఉండదా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. నామినేటెడ్ సభ్యులకు బలపరీక్ష సందర్భంగా ఓటు వేసే హక్కు ఉండదని, అయినా, ఈ విషయంలో న్యాయ సలహా తీసుకుంటున్నామని ఇప్పటికే సీఎం నారాయణస్వామి తెలిపారు. ఈ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని రాజీనామా అనంతరం లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా తాను రాజీనామా చేశానన్నారు. అయితే, వెంకటేశన్ మాత్రం తాను డీఎంకేలోనే కొనసాగుతానని, ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులను విడుదల చేయడం లేదని, దాంతో ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నానని, అందుకే రాజీనామా చేశానని వివరించారు. ఇద్దరు మాజీ మంత్రులు నమశ్శివాయ, మల్లాడి కృష్ణారావు సహా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా, మరో ఎమ్మెల్యే అనర్హతకు గురయ్యారు. -
కమల్‌నాథ్ రాజీనామా
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. బలపరీక్షకు ముందే మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి కమల్‌నాథ్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ లాల్జీ టాండన్‌కి కమల్‌నాథ్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించినట్టు రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు. దీంతో గత కొద్దిరోజులుగా మధ్యప్రదేశ్‌లో నెలకొన్న నాటకీయ పరిణామాలకు తెరపడింది. కమల్ నాథ్ రాజీనామాతో 15 నెలల కాంగ్రెస్ పాలన అర్థాంతరంగా ముగిసే పరిస్థితి ఏర్పడింది. 22 మంది శాసనసభ్యుల రాజీనామా చేయడంతో బలపరీక్షకు సుప్రీంకోర్టు శుక్రవారం సమయమిచ్చింది. కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్‌పార్టీ శుక్రవారం సాయంత్రం ఐదుగంటలకు అసెంబ్లీలో తన మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు గడువునిచ్చిన మరునాడే కమల్‌నాథ్ రాజీనామాకు ఉపక్రమించారు. గవర్నర్‌కి సమర్పించిన రాజీనామా పత్రంలో ‘నా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజాస్వామిక విలువలతో కూడిన, స్వచ్ఛమైన రాజకీయాలు నెరపాను. వాటికే ప్రాముఖ్యతనిచ్చాను. ఐతే గత రెండు వారాల్లో ప్రజాస్వామ్య విలువలకు స్వస్తిపలికే సరికొత్త అధ్యాయానికి బీజేపీ తెరతీసింది’ అని కమల్‌నాథ్ ఆరోపించారు. గవర్నర్‌కి రాజీనామా సమర్పించిన కమల్‌నాథ్ మధ్యప్రదేశ్‌కి కాబోయే నూతన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి తన తోడ్పాటునందిస్తానని తెలిపారు. ఈ రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కి అందజేయడానికి ముందు కమల్‌నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రపన్ని ప్రజాస్వామిక విలువలను ఖూనీ చేసిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభానికి జ్యోతిరాదిత్య సింధియా కారకుడంటూ నిందించారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడంతో ఆయనకు అనుకూలంగా 22 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు బలపరీక్షకు సిద్ధం కమ్మంటూ సుప్రీంకోర్టు కమల్‌నాథ్ ప్రభుత్వానికి గురువారం గడువునిచ్చింది. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ శాసనసభలో 16 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ప్రజాపతి ఆమోదించడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. విశ్వాసపరీక్ష కోసం మధ్యాహ్నం రెండు గంటలకు మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశమైంది. కమల్‌నాథ్ రాజీనామాతో రాష్ట్ర అసెంబ్లీ వాయిదాపడింది. ఒంటిగంట ప్రాంతంలో కమల్‌నాథ్ గవర్నర్‌కి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటుచేసినట్టు తెలిపిన స్పీకర్ ఎన్.పి. ప్రజాపతి, కమల్‌నాథ్ రాజీనామాతో ఆ ఆవశ్యకత లేదని వెల్లడించారు. -
కర్ణాటక సర్కారుకు షాక్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో దినదినగండంగా కొనసాగుతున్న కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్ (విజయనగర), రమేశ్ జార్కిహోళి (గోకాక్)లు తమ పదవులకు, పార్టీకి సోమవారం రాజీనామా సమర్పించారు. కర్ణాటక స్పీకర్ రమేశ్ ఇంటికి వెళ్లిన ఆనంద్ సింగ్ రాజీనామా సమర్పించగా, రమేశ్ జార్కిహోళి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖను పంపారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆనంద్ సింగ్ గవర్నర్ వజూభాయ్‌వాలాకు కూడా రాజీనామాను అందజేశారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు మాజీ సీఎం సిద్దరామయ్య ఇంట్లో అత్యవసరంగా సమావేశమయ్యారు. బీజేపీ తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కుమారస్వామి అమెరికాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వాన్ని వీడటం గమనార్హం. డిమాండ్లు ఒప్పుకోనందుకే.. ఈ సందర్భంగా ఆనంద్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ..‘నిజమే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించాను. విజయనగర జిల్లాను ఏర్పాటుచేయడం, జేఎస్‌డబ్ల్యూ కంపెనీకి బళ్లారి జిల్లాలో 3,667 ఎకరాలు అమ్మేందుకు ఇచ్చిన అనుమతుల్ని రద్దుచేయాలన్న నా డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చలేదు. ఒకవేళ ఈ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తే, నా రాజీనామాపై పునరాలోచిస్తా’ అని స్పష్టం చేశారు. అయితే తనపై రిసార్టులో దాడిచేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జె.ఎన్.గణేశ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఆనంద్‌సింగ్ రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహితవర్గాలు చెప్పాయి. మరో తిరుగుబాటు ఎమ్మెల్యే రమేశ్ జార్కి హోళి స్పందిస్తూ..‘ మంగళవారం అమావాస్య కాబట్టి ఈరోజు(సోమవారం) నా రాజీనామాను స్పీకర్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపాను. రేపు ఉదయం వ్యక్తిగతంగా కలిసి రాజీనామా సమర్పిస్తాను’ అని చెప్పారు. మరికొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి రాజీనామా చేయబోతున్నారా? అన్న మీడియా ప్రశ్నకు.. ‘మీకు ప్లాన్ మొత్తం చెప్పేస్తే ఎలా? వేచిచూడండి’ అని జవాబిచ్చారు. కాగా, ఆనంద్ సింగ్ రాజీనామా లేఖ తమకు అందిందనీ, నిబంధనల మేరకు ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని స్పీకర్ కార్యాలయం తెలిపింది. కాంగ్రెస్ నేతల అత్యవసర భేటీ ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఆ పార్టీ సీనియర్ నేతలు డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర, మంత్రి డి.కె.శివకుమార్, కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు మాజీ సీఎం సిద్దరామయ్య ఇంటిలో అత్యవసరంగా భేటీ అయ్యారు. పార్టీని ఎమ్మెల్యేలు ఎవరూ వీడకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం గుండూరావు మీడియాతో మాట్లాడుతూ..‘మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ అగ్రనేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, కేంద్ర సంస్థల ద్వారా మా ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎన్నికుట్రలు చేసినా ఐదేళ్ల పాటు కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ సర్కారు కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు కర్ణాటకలో రాజకీయ పరిస్థితుల్ని తాను గమనిస్తున్నాననీ, తమ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ పగటి కలలు కంటోందని సీఎం కుమారస్వామి ఎద్దేవా చేశారు. అయితే కాంగ్రెస్–జేడీఎస్ కూటమిలో తీవ్రమైన అసంతృప్తి ఉందనీ, ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని రాష్ట్ర బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప జోస్యం చెప్పారు. అసెంబ్లీలో బలాబలాలు.. కాంగ్రెస్ పార్టీకి 77 మంది, జేడీఎస్‌కు 37 మందితో పాటు ముగ్గురు స్వతంత్రులు కలిపి కర్ణాటక అసెంబ్లీలో అధికార కూటమికి 117 స్థానాలు ఉన్నాయి. అయితే ఆనంద్ సింగ్, రమేశ్ రాజీనామాతో ఆ బలం 115కు పడిపోయింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 113కు తగ్గింది. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి నుంచి మరో 9 మంది ఎమ్మెల్యేను ఆకర్షించే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. -
రాజీనామా చేస్తే పది కోట్లు, మంత్రిపదవి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఆడియో టేపుల వ్యవహారం సెగలు పుట్టిస్తోంది. జేడీఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టాలని ప్రయత్నించినట్లుగా ఉన్న మరో ఆడియోటేపు తాజాగా బయటకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఒక టేపును ఈ నెల 8న స్వయంగా సీఎం కుమారస్వామి విడుదల చేయడం తెలిసిందే. ఈ నెల 7న బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు యడ్యూరప్ప జేడీఎస్ ఎమ్మెల్యేలు శివనగౌడ నాయక్, ఆయన కుమారుడు శరణ గౌడలతో మాట్లాడినట్లుగా చెబుతున్న మరో ఆడియో టేపు తాజాగా జేడీఎస్ వర్గాల ద్వారా బయటకొచ్చింది. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తే ఒక్కొక్కరికి రూ. 10 కోట్లు ఇస్తామని, ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తామే గెలిపించుకోవడంతోపాటు మంత్రి పదవి కూడా ఇస్తామని యడ్యూరప్ప హామీ ఇచ్చినట్లుగా ఆ టేపులో ఉంది. నువ్వే మంత్రివి కావచ్చు.. టేపులో ఉన్న దాని ప్రకారం శరణగౌడతో యడ్యూరప్ప మాట్లాడుతూ ‘మొదటి మీ నాన్నతో రాజీనామాకు ఒప్పించు. ముంబై లోని హోటల్లో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నీవు అక్కడికి వెళ్లు. సాయంత్రానికి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారు. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు అయ్యాక అందరు కలసి ఒకేసారి రాజీనామా చేయండి. ఆ వెంటనే మొదట మీ ఇంటికి రూ. 20 కోట్లు వస్తాయి. ఆర్థిక వ్యవహారాలన్నీ నా కొడుకు బీవై విజయేంద్ర చూసుకుంటాడు. ఉప ఎన్నికల్లో నిన్ను గెలిపించి, మంత్రిని కూడా చేస్తాము. లోక్‌సభ ఎన్నికల తర్వాత జేడీఎస్ పార్టీ ఎక్కడికిపోతుందో ఎవరికీ తెలియదు’ అని సూచించారు. శివనగౌడ మాట్లాడుతూ రాజీనామా చేస్తే స్పీకర్ వెంటనే దాన్ని అంగీకరించరేమో.. అని చెప్పబోతుండగా మళ్లీ యడ్యూరప్ప.. ‘దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవ సరం లేదు. సమావేశాలు ముగిసేలోగా రాజీనామాలను స్పీకర్ అంగీకరించి తీరాల్సిందే. అదం తా పెద్దలు చూసుకుంటారు. ప్రధాని, అమిత్ షా, గవర్నర్ చూసుకుంటారు. నిన్ను మంత్రిని చేయడమే కాకుండా యాదగిరి జిల్లాకు ఇంచార్జిని కూడా చేస్తాం. రాజీనామాకు అంగీకరిస్తే సాయంత్రంలోగా రాయ చూరులోని మార్వాడిల నుంచి రూ. 20 కోట్లు అందిస్తాం’ అని చెబుతున్నట్లుగా ఉంది. -
సొంతపార్టీ ఎమ్మెల్యేలే గట్టి షాక్ ఇచ్చారు..
షిల్లాంగ్ : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మేఘాలయలో కాంగ్రెస్ పార్టీకి ...సొంత ఎమ్మెల్యేలే గట్టి షాక్ ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో ఉపముఖ్యమంత్రి రోవెల్ లింగోడ్ కూడా ఉన్నారు. అలాగే వీరితో పాటుగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. మొత్తం 60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 30 మంది సభ్యులు ఉండగా, వారిలో అయిదుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి రాజీనామాలు చేయడం చర్చనీయాంశమైంది. వీరంతా తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్ కు సమర్పించారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పిఎన్ సయ్యం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ మరో ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామాలతో కాంగ్రెస్ బలం 24కు పడిపోయింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అందరూ వచ్చేవారం నేషనల్ పీపుల్స్ పార్టీలో చేరనున్నారు. కాగా మేఘాలయ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది మార్చి 6లో మగియనుంది. -
ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా!
జలీల్‌ఖాన్ వెళ్లాక పశ్చిమానికి పట్టిన పీడ విరగడైంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యులు విజయవాడ : పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే సత్తా అధికార పార్టీకి ఉందా? అని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా వ్యవహారాల ఇన్చార్జి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాలు విసిరారు. పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో రాజీ నామా చేయించే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. బుధవారం చిట్టినగర్‌లో వైఎ స్సార్ సీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాజధాని పేరిట భూవ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారన్నారు. నదుల అనుసంధానం పేరిట దోపిడి, పట్టిసీమ పనుల్లో కాంట్రాక్టర్‌కు మేలు కలిగేలా 27 శాతం పెంచుతూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారన్నారు. నిబంధనలను పక్కన పెట్టి అసెంబ్లీని నడిపిస్తున్నారని, 29వ తేదీన బడ్జెట్‌కు అను కూలంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ఓటు వేయించుకునే సత్తా టీడీపీకి ఉందా అని ప్రశ్నించారు. పశ్చిమంలో వైఎస్సార్ సీపీకి తిరుగులేదు పార్టీ నగర వ్యవహారాల ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి తిరుగులేదని నిరూపితమైందన్నారు. వైఎస్సార్ సీపీకి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ మైనార్టీలను టీడీపీ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తానని విభజన చట్టంలో పేర్కొన్నప్పటికీ, ఒక రూపాయి తీసుకురాలేకపోయారన్నారు. నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. పశ్చిమం నుంచి ఎవరిని బరిలోకి దింపినా వారికి 40 వేల పైబడి మెజారిటీ వస్తుందని కార్యకర్తల ఉత్సాహాన్ని చూస్తే అర్థమవుతోందన్నారు. పార్టీ రాజ కీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ జలీల్‌ఖాన్ వెంట గన్‌మెన్, కారు డ్రైవర్, మరో ఇద్దరే వెళ్లారని ఎద్దేవాచేశారు. జలీల్ఖాన్ను గెలిపించే సత్తా ఉందా? యువజన విభాగం రాష్ర్ట అధ్యక్షుడు వంగవీటి రాధా మాట్లాడుతూ జలీల్‌ఖాన్‌తో రాజీనామా చేయించి అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీకి తిరిగి గెలిపించుకునే సత్తా ఉందా అని ప్రశ్నించారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ పార్టీలో పదవులు అనుభవించి కార్యకర్తలను, నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన గలీజ్ఖాన్ పీడ విరగడైందన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జ ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. గుంటూరు జిల్లా పరిషత్ పార్టీ ఫ్లోర్‌లీడర్ దేవళ్ల రేవతి, పార్టీ నాయకులు బండి నాగేంద్ర పుణ్యశీల, బేగ్, కాలే పుల్లారావు అశోక్‌యాదవ్, కర్నాటి రాంబాబు పాల్గొన్నారు. పశ్చిమ వైఎస్సార్ సీపీలో నూతనోత్తేజం పశ్చిమ నియోజకవర్గ సమావేశం క్యాడర్లో నూతనోత్తేజం నింపింది. ‘ప్రతి వీధిలోనూ పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారు. ఎంత మంది జలీల్‌ఖాన్‌లు పార్టీ పోయినా క్యాడర్ మాత్రం చెక్కుచెదరదు. క్యాడర్ గురించి మీరు ఆలోచించకుండా మేం చేయాలో చెప్పిండి’ అంటూ ఓ కార్యకర్త ప్రసంగించారు. క్యాడర్లో ఆత్మ విశ్వాసం నింపటమే లక్ష్యంగా పార్టీ ముఖ్యులు కసరత్తు చేశారు. నగర పరిశీలకుడు లేళ్ల అప్పిరెడ్డి, ఉత్తర, దక్షిణ కృష్ణా అధ్యక్షులు కొలుసు పార్థసారథి, కొడాలి నాని శ్రేణులతో మాట్లాడి అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారు. పార్టీ ముఖ్య నేతలకు పశ్చిమ నియోజకవర్గ క్యాడర్ ఆపూర్వ స్వాగతం పలికారు. పార్టీ జిల్లా వ్యవహారాల పరిశీలకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పార్టీ నాయకులు గజమాలతో సత్కరించారు. -
9 స్థానాలకు ఉప ఎన్నిక తప్పదా?
⇒ టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల రాజీనామాపై జోరుగా చర్చ ⇒ అనర్హత వేటుపై పెండింగ్‌లో స్పీకర్ నిర్ణయం ⇒ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు యోచనపై ఊహాగానాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉప ఎన్నికల నగారా మోగనుందా... టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇదే ఆలోచనలో ఉన్నారా.. ప్రస్తుతం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ ఇది. వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై స్పీకర్ నిర్ణయం ఇంకా పెండింగ్‌లో ఉంది. అలాగే మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీనిపైనా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. అలాగే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్, టీడీపీలు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు గడ్డం విఠల్‌రెడ్డి, కనకయ్య, రెడ్యానాయక్, కాలే యాదయ్యతోపాటు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు తమ తమ పార్టీలను వదిలి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయా పార్టీల నాయకత్వాలు వీరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ మధుసూదనాచారికి ఫిర్యాదు చేశాయి. ఈ పరిస్థితుల్లో తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చే యించి ఉప ఎన్నికలకు వెళ్లాల్సిన అనివార్య పరిస్థితి ఉందన్నది రాజకీయవర్గాల అభిప్రాయం. వీరిపై అనర్హత వేటు వేయకుండా, లేదంటే రాజీనామానాలు చేయించకుండా సభలోనే ఉంచి నడిపించడం అంత తేలికైన విషయం కాదని, ఉప ఎన్నికలకు పోవడం ఒక్కటే టీఆర్ఎస్ ముందున్న ఏకైక మార్గమని పరిశీ లకులు విశ్లేషిస్తున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ మదిలో ఏముందన్నది టీఆర్ఎస్ వర్గాల్లోనే స్పష్టత లేదు. పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తే, 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశముంది.