
సాక్షి, హైదరాబాద్: ఏ పార్టీకైనా కింది స్థాయి నాయకులు, కార్యకర్తలే నిజమైన బలమని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మంథని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాయకులు మంత్రి ఈటల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కాటారం జెడ్పీలో కాంగ్రెస్ పార్టీ నేత చల్లా నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులతోపాటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.
వీరందరికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. మంథనిలో టీఆర్‌ఎస్ మరింత బలపడుతోందన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో మూడేళ్లలోనే దేశంలో రాష్ట్రానికి ప్రత్యేక స్థానం దక్కిందన్నారు. పెద్ద పట్టణాలకే కాకుండా రాష్ట్రంలోని గిరిజన గూడాలకు కూడా మంచి నీరు ఇవ్వబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో వేగంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కరెంట్ సమస్యను అధిగమించామని ఈటల చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment