
సాక్షి, భూపాలపల్లి: ‘‘రెండు పర్యాయాలు విజయం ముంగిట్లో ఓడిపోయా.. టికెట్ ఇస్తారనే భరోసాతో టీఆర్‌ఎస్‌లో చేరా.. నన్ను నమ్మించి గొంతుకోశారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా’’అని జయశంకర్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్ అసంతృప్తనేత గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన ‘సాక్షి’తో తన మనోగతాన్ని పంచుకున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరి దాదాపు 10 నెలలైందని తెలిపారు.
గడిచిన రాజ్యసభ ఎన్నికల్లో భూపాలపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేను రాజ్యసభకు నామినేట్ చేస్తామని, ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి టికెట్ ఇస్తామని నమ్మించి మోసం చేశారని వాపోయారు. రెండు సార్లు కేటీఆర్, ఒకసారి కేసీఆర్ టికెట్‌పై హామీ ఇవ్వడంతో టీఆర్‌ఎస్‌లో చేరానని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రజలు మద్దతు ఇస్తున్నారని, ఈసారి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తానన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment