
జర్మనీ పార్లమెంటు 19వ బుందేస్టాగ్‌కు జరిగిన ఎన్నికల్లో వివిధ ప్రధాన రాజకీయపక్షాలకు వచ్చిన సీట్లు..
- పాలక సీడీయూ-సీఎస్‌యూ కూటమి-246
- ప్రతిపక్షంగా మారిన ఎస్‌పీడీ-153
- బుందేస్టాగ్‌లో తొలిసారి ప్రవేశించిన ఏఎఫ్‌డీ-94
- పాలక కూటమిలో చేరే ఎఫ్‌డీపీ-80
- లెఫ్ట్ పార్టీ - 69
- గ్రీన్స్ పార్టీ- 67
జర్మనీ ఫెడరల్ దిగువసభ బుందేస్టాగ్‌లో సభ్యుల సంఖ్య స్థిరంగా ఉండదు. ప్రతి ఎన్నికల్లో వివిధ పార్టీలకు లభించే ఓట్ల ఆధారంగా కొన్ని సీట్లు స్థిర సీట్లకు కలుపుతారు. గత బుందేస్టాగ్‌లో మొత్తం 631 మంది సభ్యులుండగా, ఈసారి ఈ సంఖ్య 709కి పెరుగుతుంది. ఈ లెక్కన చాన్సలర్‌గా ఎన్నికవడానికి 355 మంది సభ్యుల మద్దతు అవసరమౌతుంది.
బుందేస్టాగ్‌లోని మొత్తం సభ్యుల్లో 299 మంది అంతేసంఖ్యలో ఉండే నియోజకవర్గాల నుంచి ఎన్నికైనవారితోపాటు, దామాషా పద్ధతిలో మరో 299 మంది సభ్యులుగా నియమితులైనవారుంటారు. వారినే (598 మంది) రెగ్యులర్ సభ్యులంటారు. వారేగాక వివిధ పార్టీలకు మొదటి ఓటు(నియోజకవర్గాల్లో) సీట్లలో వచ్చిన ఓట్లు, రెండో ఓట్ల(దామాషా ఓట్లు) వివరాల ఆధారంగా హేంగోవర్, బ్యాలెన్స్ సీట్ల ప్రతినిధులుగా మరికొంతమంది సభ్యులుగా చేరతారు. ఈ నాలుగు పద్ధతుల్లో బుందేస్టాగ్ సభ్యులయ్యేవారి సంఖ్య ఈసారి 709 ఉంటుంది. చాన్సలర్‌గా దేశాధ్యక్షుడు నియమించాలంటే కనీసం 312 మంది సభ్యుల మద్దతు అవసరం. నియామకం తర్వాత కొత్త చాన్సలర్‌కు మెజారిటీ ఉన్నదీ లేనిదీ తేల్చడానికి ఓటింగ్ జరుగుతుంది. ప్రస్తుత పాలక కూటమి పార్టీలు సీడీయూ, సీఎస్‌యూలకు గత ఎన్నికలతో పోల్చితే 65 సీట్లు తగ్గాయి. పాలక కూటమి నుంచి వైదొలుగుతున్న ప్రధాన ప్రతిపక్షం ఎస్‌పీడీ(సోషల్ డెమొక్రాట్లు) 40 సీట్లు కోల్పోయింది. కిందటిసారి ఒక్క సీటూ సాధించని ఏఎఫ్‌డీకి 13.3 శాతం ఓట్లతో 94 సీట్లు కైవసం చేసుకుంది. ప్రతిపక్షంలోనే కొనసాగుతున్న లెఫ్ట్ పార్టీకి అదనంగా 5 సీట్లు లభించగా, గ్రీన్ పార్టీ మరో నాలుగు సీట్లు సంపాదించింది.
-సాక్షి నాలెడ్జ్ సెంటర్