
భోపాల్ : వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని, మాట్లాడే విషయంలో నిగ్రహం పాటించాలని బీజేపీ అధినాయకత్వం ఎంతగా చెప్తున్నా ఆ పార్టీ నేతలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం రేపుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్యా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సమాజాన్ని చెడగొట్టే సంస్కారం లేని పిల్లల్ని కనడం కన్నా మహిళలు సంతాన విహీనులుగా ఉండటం మంచిదని ఆయన చెప్పుకొచ్చారు. గుణా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన పన్నాలాల్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘గరీబీ హఠావో’ (పేదరికాన్ని నిర్మూలించండి) అని కాంగ్రెస్ నినాదం ఇచ్చింది. కానీ ఆ పార్టీ పేదల్నే నిర్మూలించింది. కొందరు మహిళలు ఇలాంటి నాయకులకు జన్మనిస్తున్నారు. సమాజాన్ని చెడగొట్టే సంస్కారం లేని పిల్లల్ని కనడం కంటే.. మహిళలు గొడ్రాళ్లుగా ఉండటం మంచింది’ అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment