
సాక్షి, విశాఖపట్నం: పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ విశాఖలో జనసేనకు భారీ షాక్ తగిలింది. కీలక సమయంలో పలువురు నేతలు జనసేనను వీడుతుండటం పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు మింగుడుపడటం లేదు. తాజాగా జనసేన అవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకురాలు గుంటూరు భారతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో భారతి వైఎస్సార్‌సీపీలో చేరారు. భారతి వైఎస్సార్ సీపీలో చేరడంతో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలో ఉన్న గంటా వర్గం కూడా డీలా పడినట్టుగా తెలుస్తోంది. జనసేన నుంచి భారతి ద్వారా ఓట్లు ఆశించిన టీడీపీ నేతలు ఆందోళనలో పడ్డారు.
ఇటీవల శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ నేత పైలా రమేశ్, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంకు చెందిన అనిశెట్టి సుబ్బారావు, వైఎస్సార్ కడప జిల్లా నాయకుడు మాలే శివ, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యర్రా నవీన్‌లు జనసేనను వీడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment