లక్నో : సార్వత్రిక ఎన్నికల వేళ కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి షాక్ తగిలింది. సిట్టింగ్ ఎంపీ అన్షుల్ వర్మా బుధవారం బీజేపీకి రాజీనామా చేశారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, మరో సీనియర్ నేత ఆజంఖాన్ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీ చేరారు. హర్దోయ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అన్షుల్‌కు ఈ సారి బీజేపీ టికెట్ నిరాకరించింది. అక్కడి నుంచి జయప్రకాశ్ రావత్‌ని బరిలో నిలిపింది.
ఎస్పీలో చేరిన అనంతరం అన్షుల్ మాట్లాడుతూ.. ‘కొంతకాలం క్రితం ఓ దేవాలయ ప్రాంగణంలో మద్యం పంపిణీ చేస్తున్న బీజేపీ నేతల్ని అడ్డుకున్నాను. అప్పటినుంచే పార్టీలో నాపై వ్యతిరేకత పెరిగింది’ అని చెప్పుకొచ్చారు. ఇక ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘మైభీ చౌకీదార్’ కార్యక్రమానికి కూడా ఆయన దూరంగా ఉన్నాను. ట్విటర్‌లో తన పేరుకు మందుకు మైభీ చౌకీదార్ హాష్‌టాగ్ జతపర్చలేదు. పార్టీలో అసంతృప్త నేతగా ఉన్న అన్షుల్‌ను బీజేపీ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment