సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే గెలుపని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాదు. అధికారంలోకి రాదు కాబట్టే ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ నేతలు హామీలు ఇస్తున్నారు. 2004లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కటైనా అమలు చేశారా. అమలు చేయని కాంగ్రెస్‌ను ప్రజలు ఎలా నమ్ముతారు. తొమ్మిది గంటల కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి...చివరకు కంటితుడుపు చర్యగా కరెంటు ఇచ్చారు. ఉద్యమ కాలంలో రాజీనామాలు చేద్దాం రండి అంటే పారిపోయారు.
కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుల పేర్లే.. పెండింగ్ ప్రాజెక్టులుగా మారాయి. మా హయాంలో అవి రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయి. మీరు కరెంట్ ఇవ్వలేదు. మేం ఇచ్చినం, మీరు నీళ్లు ఇవ్వలేదు..మేం నీళ్లు ఇచ్చినం. మీ హయాంలో ఆడపిల్ల భారం.. మా పాలనలో లక్ష్మీ. బస్సు యాత్ర కేవలం ఉనికి కోసమే. మీరు ఒత్తిడిలో ఉన్నారని.. మీ మాటలే చెడుతున్నయి. మంత్రి ఈటెల రాజేందర్ మీద విమర్శలు నిరాధారం.' అని హరీష్ రావు తెలిపారు.
కేసీఆర్ మాటే.. నా మాట
'కేసీఆర్ మాటే.. నా మాట. నా పుట్టుక టీఆర్‌ఎస్‌లో.. చావు కూడా టీఆర్‌ఎస్‌లోనే' అని హరీష్ రావు స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ కోరినట్టు ఆయన తెలిపారు. ఇకపై అలాంటి పుకార్లు ఎవరు ప్రచారం చేసినా చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment