సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుదల ఉండదని తెలిసిన తర్వాతే ప్రత్యేక హోదా అంటూ రాష్ట్రపెద్దలు యూటర్న్ తీసుకున్నారని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఈ విషయంలో బీజేపీ నిద్రలేచేసరికే అనుకూల మీడియా ద్వారా రాష్ట్ర పెద్దలు అబద్ధాలు ప్రచారం చేశారని ఆయన విమర్శించారు. గుంటూరు నగరంలో ఆదివారం నవ్యాంధ్ర మేధావుల ఫోరం సమావేశం జరిగింది. మోదీ నాలుగేళ్ల పాలన, ఏపీ విభజన చట్టంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన ఐవైఆర్ మాట్లాడుతూ.. విభజన చట్టం లోపభూయిష్టంగా మారిందన్నారు.
విభజన చట్టం అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో రాజకీయ చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి, తప్ప కోర్టుకు వెళ్తే రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనమూ ఉండదని అన్నారు. కేంద్రంలోని అధికారులు మనవారికంటే వెయ్యిరెట్లు జాగ్రత్తగా ఉంటారని, వారికి తప్పుడు రిపోర్టులు ఇస్తే పనులు కావని ఐవైఆర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment