
సాక్షి, హైదరాబాద్: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో కుంభకోణం జరిగిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలతో తేలిపోయిందని కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ అధికార ప్రతినిధి జైపాల్‌రెడ్డి అన్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది నిజమని రుజువైందని, మోదీ పతనం రాఫెల్‌తోనే ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒక దేశానికి సంబం« దించిన వ్యాపార ఒప్పందాన్ని మరో దేశ ప్రభుత్వం ఖండించడం చరిత్రలో ఇదే మొదటిసారని అన్నారు.
మోదీ ప్రభుత్వ ఒత్తిడితోనే తాము ఈ డీల్‌ను అంగీకరించామని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్య లపై బీజేపీ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నిం చారు. రాఫెల్ వ్యవహారంలో భారత దేశ ప్రజలకు పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పిన కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, నిర్మలా సీతారామన్‌లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబానీ మోదీకి బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని, రాఫెల్ డీల్ తో నాలుగేళ్లలో అంబానీకి రూ.లక్ష కోట్ల లబ్ధి కలగనుందన్నారు. నోరు తెరిస్తే బయటపడతాననే భయంతోనే మోదీ మాట్లాడడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment