శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పట్టణ స్థానిక సంస్థలకు అక్టోబర్ 8న తొలివిడత పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలుత 79 మున్సిపాలిటీలకు, ఆ తర్వాత పంచాయితీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్య ఎన్నికల అధికారి షాలీన్ కబ్రా తెలిపారు. మున్సిపాలిటీలకు ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. కశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలను వాడుతున్నామని కబ్రా పేర్కొన్నారు. ఈ నెల 18న మున్సిపాలిటి తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేస్తామన్నారు. 25న నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించి 28 నాటికి ముగిస్తామని వెల్లడించారు. అక్టోబర్ 8న తొలిదశ పోలింగ్ జరుగుతుందన్నారు. తాజా ప్రకటనతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కబ్రా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment