పవన్‌ కల్యాణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు | Janasena Chief Pawan Kalyan Controversial Comments | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Published Mon, Jun 24 2019 7:47 PM | Last Updated on Mon, Jun 24 2019 10:06 PM

Janasena Chief Pawan Kalyan Controversial Comments - Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనుకున్నది సాధించుకోవడంలో తెలంగాణ ప్రజలకున్న పట్టుదల..ఆకాంక్ష ఆంధ్రా ప్రజలకు లేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు దశాబ్దాలపాటు పోరాడితే.. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర ప్రజలు అంతటి ఆకాంక్షను చూపలేకపోయారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. 

ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పదిసార్లు మాటలు మార్చినా ప్రజల నుండి సరైన నిరసన రాలేదని పవన్ అన్నారు. ప్రజల నుండి బలమైన నిరసన రానంతవరకు హోదా విషయంలో తామేమీ చేయలేమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. హోదా సాధన విషయంలో ఆంధ్ర ప్రజలకు బలమైన ఆకాంక్ష ఉంటే తప్ప ఎవరూ ఏమీ చేయలేరని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదా పోరాటం నుంచి తప్పుకునేందుకే పవన్‌ కల్యాణ్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో ప్రజలు, ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం మొక్కవోని దీక్షతో పోరాటాలు చేసి.. హోదా ఆశలను సజీవంగా ఉంచిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రజలు అనేక సందర్భాల్లో ప్రత్యేక హోదా కోసం తమ ఆకాంక్షను బలంగా చాటారు. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement