సాక్షి, హైదరాబాద్: శాసనసభను ఇంత ఏకపక్షంగా నడిపించడాన్ని ఏనాడూ చూడలేదని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతుంటే మైక్ ను కట్ చేస్తున్నారని అన్నారు. శాసనసభను స్పీకరు కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లో, ఆదుపాజ్ఞల్లో నడిపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో దళితులకు అన్యాయం జరుగుతోందని, దళిత సంక్షేమ నిధులను వృథా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా దళితులకోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment