
సాక్షి, జగిత్యాల: టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు తాను అడ్డుపడ్డానంటూ నిజామాబాద్ ఎంపీ కవిత వ్యాఖ్యానించడంపై తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మండిపడ్డారు. అసలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు తాను ఎక్కడ అడ్డుపడ్డానో చెప్పాలంటూ సవాల్ విసిరారు. ఎంపీగా కవిత జగిత్యాలకు నాలుగేళ్లలో 40 సార్లు వచ్చారని.. ఆ నియోజకవర్గాని ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
‘ఎల్ రమణ, నేను ఇద్దరం జగిత్యాల బిడ్డలమే. మేము అరువు వచ్చిన వాళ్లం కాదు. ఇక్కడే పుట్టాం. ఇక్కడే గిట్టుతాం. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో నేను రెండు రోజులు జైలులో ఉన్నా.. మీరు ఎన్ని రోజులు జైలు ఉన్నారు. మేము అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేయడం ఎందుకు?. మేము అధికారంలో ఉన్నప్పుడు నాలుగువేల ఇళ్లు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాం. అవి పూర్తైతే జీవన్ రెడ్డికి పేరొస్తుందని నాలుగేళ్లలో ఒక్క ఇల్లు పూర్తి చేయించలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులను ఎక్కడ అడ్డుపడ్డానో నిరూపించాలి’ అని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment