
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా రంగంలోకి దిగనున్నారు. ఇందులో భాగంగా ఆయన సోమవారం తొలిసారి పార్టీ స్టేట్ మీడియా వర్క్‌షాప్‌లో పాల్గొననున్నారు. వీలైనన్ని రోజులు ఇక్కడే ఉండి ప్రచార వ్యూహాలు రచించనున్నారు. ఇటీవలే నడ్డా పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. అన్ని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపాలని భావిస్తున్న నేపథ్యంలో.. అభ్యర్థుల ఎంపికలో నడ్డా కీలకంగా వ్యవహరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment