సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో మళ్లీ ఎన్డీయేదే అధికారమని, మోదీనే మరోసారి ప్రధాని అవుతారని అలా కాకుంటే తాను రాజకీయ సన్యాసం చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఒకవేళ కేంద్రం లో ఎన్డీయే వస్తే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయ సన్యాసానికి సిద్ధమేనా అని ఆయనకు సవాలు విసిరారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లను గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతాం అంటూ టీఆర్‌ఎస్ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 16 ఎంపీ సీట్లను గెలిచి టీఆర్‌ఎస్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? కనీసం వారి ప్రధాని అభ్యర్థి పేరునైనా వెల్లడించగలిగారా అంటూ కేటీఆర్‌పై మండిపడ్డారు. దేశంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని, అందుకే బీజేపీ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
మోదీ నాలుగు..అమిత్ షా ఆరు
ఈనెల 15న ఢిల్లీలో జరిగే పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థుల జాబి తాపై చర్చిస్తామని, అదే రోజు లేదా 16న అభ్యర్థుల ప్రకటన ఉంటుం దని లక్ష్మణ్ చెప్పారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో నాలుగు సభల్లో పాల్గొంటారని, అందులో ఒకటి ఈ నెలలోనే ఉంటుందని తెలిపారు. అమిత్‌షా సభలు ఆరు ఉంటాయన్నారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ఇతర కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు బహిరంగ సభల్లో పాల్గొంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment