కీలక నిర్ణయం తీసుకున్న కమల్‌ | Kamal Haasan announced to Tour Tamil Nadu | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 15 2018 2:09 PM | Last Updated on Mon, Sep 17 2018 4:56 PM

Kamal Haasan announced to Tour Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై  : రాజకీయ అరంగ్రేటంలో సీనియర్‌ నటుడు కమల్‌ హాసన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రకటన కంటే ముందే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమైపోయాడు. ఈ మేరకు కమల్‌ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘తమిళనాడులో ప్రస్తుతం అవినీతి పాలన నడుస్తోంది. ప్రస్తుత పరిణామాలను ప్రజలకు వివరించి.. వారి సమస్యలను తెలుసుకునేందుకే నా పర్యటన. జనవరి 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తా. పర్యటన వివరాలను ఆనంద్‌ వికటన్‌ తదుపరి సంచికలో వెల్లడిస్తా’’ అని కమల్‌ పేర్కొన్నాడు. మైయామ్‌ విజిల్‌ యాప్‌ ద్వారా ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందాయని.. త్వరలోనే అవినీతి తిమింగలాల బండారం బయటపెడతానని ఆయన అన్నారు.

జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై 63 ఏళ్ల కమల్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించాడు. అన్ని వర్గాల వారిని కలుపుకుని ముందుకు సాగి అంతిమంగా విజయం సాధించటమే తన లక్ష్యమని కమల్‌ చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement