
సిద్ధిపేట: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగితే, పిచ్చి కూతలు కూస్తున్న కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాదం పేరిట నిర్వహించిన సభలో మాట్లాడిన కేసీఆర్.. ముందుగా స్థానిక ప్రజానికానికి హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు. మళ్లీ ముందుగా ‘మీ దర్శనం కోసమే హుస్నాబాద్‌కు’ వచ్చానంటూ కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్టంలో ఈ పేదరికానికి, దరిద్రానికి కాంగ్రెసే కారణమంటూ విమర్శించారు. సమైక్య రాష్టంలో జీవన విధ్వంసం జరిగితే, టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందామన్నారు. అధికారుల ఆత‍్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ యత్నిస్తుందన్నారు. టీఆర్‌ఎస్ రాకముందు తెలంగాణలో కరెంట్ పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసని పేర్కొన్న కేసీఆర్.. రైతులకు 24 గంటలు కరెంటు ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అనే విషయం వాస్తవం కాదా అన్నారు. అన్ని రంగాల్లోనూ దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. దీనిలో భాగంగా హుస్నాబాద్ టీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్ధి సతీష్‌ను గెలిపించాలని కోరారు.
కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే..
- తెలంగాణ కోసం కాంగ్రెస్ నేతలు ఎవ‍్వరూ పనిచేయలేదు
- నేను తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసి చావు అంచుల దాకా వెళ్లా
- చిప్పలు పట్టుకుని అడుక్కోవడం తప్ప కాంగ్రెస్ ఏమీ చేయలేదు
- టీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు భరోసా వచ్చింది
- కేసీఆర్ లాంటి కిట్‌లను కాంగ్రెసోళ్లు ఇచ్చారా
- ప్రాజెక్టుల రీడిజైనింగ్ తప్పట.. కాంగ్రెస్ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారు
- కాంగ్రెసోళ్ల నోటికి హద్దు పద్దూ లేదు
- 31 జిల్లాల ఏర్పాటు అన్నది సాహసోపేత నిర్ణయం
- కొత్త మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తున్నాం
- అధికారం ఢిల్లీ పెద్దల చేతుల్లో కాదు.. మన చేతుల్లో ఉండాలి
- మళ్లీ టీఆర్‌ఎస్‌కు అధికారం అప్పగిస్తే ఐదేళ్లు బ్రహ్మాండంగా పాలిస్తాం
- కల్యాణలక్ష్మికి ముందు రూ. 51 వేలు పెట్టాం
- రాష్ట్ర ఆదాయం పెరుగుతుండటంతో దాన్ని రూ. 1.06 లక్షలు చేశాం
Comments
Please login to add a commentAdd a comment