సాక్షి, హైదరాబాద్: అవును! మీరు చదివేది నిజమే. ట్వంటీ–20 క్రికెట్ మ్యాచ్ కాదు.. ట్వంటీ–ట్వంటీ.. కచ్చితంగా రాజకీయ పార్టీయే. ఇదే కాదు.. ఇంకా యూత్ ఇండియా టాంగ్రెస్ పార్టీ, ఇండియా లవర్స్ పార్టీ, లైఫ్ పీస్‌ఫుల్ పార్టీ, జాగ్‌తే రహో పార్టీ, విధాయక్ పార్టీ, విదర్భ్ మజా పార్టీ, సూపర్ నేషన్ పార్టీ, వోటర్స్ పార్టీ, వాజిద్ అధికారి పార్టీ, భరోసా పార్టీ, సబ్సే బడే (అన్నింటికన్నా పెద్ద) పార్టీ, రాష్ట్రీయ సాఫ్‌నీతి పార్టీ.. ఇలాంటి చిత్ర విచిత్రమైన పేర్లతో ఎన్నికల కమిషన్‌లో రిజిస్టర్ చేయించుకున్న రాజకీయ పార్టీల జాబితాలో మొత్తంగా 2,301 పేర్లు ఉన్నాయి.
గుర్తులుండవ్..
కేరళలో రిజిస్టర్ అయిన ట్వంటీ–20 పార్టీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 20–20) నుంచి స్ఫూర్తి పొంది ఆ పేరు పెట్టుకున్నట్టు ఉంది. అలాగే ప్రేమను నిలబెట్టుకోవడం కోసం సమాజానికి ఎదురొడ్డి, ప్రేమికులు చేసే పోరాటంలో వారికి అండగా నిలిచే లక్ష్యంతో పనిచేస్తోన్న బీ కుమార్ శ్రీశ్రీ తన రాజకీయ పార్టీని ఇండియన్ లవర్స్ పార్టీ పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారు.
జాగ్‌తే రహో (జాగృతం కండి) పార్టీ
పౌరులంతా జాగృతం కావాలనీ, నిరంతరం జాగ్రత్తతో వ్యవహరిస్తూ, పరస్పరం మేల్కొల్పుతూ ఉండాలని దీనర్థం. ఒక పార్టీలో మతం, వ్యక్తి, పార్టీ, దేశం అన్నీ వచ్చేలా ద రెలిజియన్ ఆఫ్ మాన్ రివాల్వింగ్ పొలిటికల్ పార్టీ ఆఫ్ ఇండియాగా మరో విచిత్రమైన పేరుతో ఒక పార్టీని రిజిస్టర్ చేశారు. బిహార్‌లోని సీతామర్హిలోని బహుజన్ ఆజాద్ పార్టీ, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన సమూహిత్ ఏక్‌తా పార్టీ, రాజస్థాన్‌కి చెందిన జైపూర్‌లోని రాష్ట్రీయ సాఫ్‌నీతీ పార్టీ, ఢిల్లీలోని సబ్సే బడా పార్టీ, తెలంగాణలోని భరోసా పార్టీ, తమిళనాడు కోయంబత్తూర్‌లో న్యూ జనరేషన్ పీపుల్స్ పార్టీ, పూర్‌మాన్స్ పార్టీ, యువర్స్–మైన్ పార్టీ, మై హీ భారత్ పార్టీ, వోటర్స్ పార్టీ, విధాయక్ పార్టీ, విదర్భ మజా పార్టీ, యూత్ ఇండియా టాంగ్రెస్ పార్టీ, వాజిబ్ అధికార్ పార్టీ అలాగే టమిజ్‌దార్ పార్టీ, టోలా లాంటి విచిత్రమైన పేర్లతో మొత్తం 149 పార్టీలు ఎన్నికల కమిషన్‌లో పేరు రిజిస్టర్ చేయించుకున్నాయి.
లవర్స్ పార్టీ.. ట్వంటీ–ట్వంటీ
Published Sun, Mar 24 2019 9:45 AM | Last Updated on Sun, Mar 24 2019 9:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment