సాక్షి, కృష్ణా : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మోకా భాస్కర్‌రావు హత్య నూటికి నూరు శాతం రాజకీయ హత్యేనని మంత్రి పేర్ని నాని తెలిపారు. సోమవారం మచిలీపట్నంలో హత్యకు గురయిన భాస్కర్‌రావు మృతదేహానికి మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘భాస్కర్‌రావును వ్యక్తిగతంగా నేను బాబాయ్ బాబాయ్ అని పిలుస్తాను. భాస్కర్‌రావు తండ్రి నుంచి ఆయన వరకు మాకు వెన్నంటి ఉన్నారు. చేపల మార్కెట్‌లో అభివృద్ధి పనులు చేయిస్తుంటే ఓర్వలేనితనంతో గత 15 రోజులుగా రెక్కీ నిర్వహించి పక్కా పథకం ప్రకారమే హత్య చేశారు. నేర ప్రవృత్తి ఉన్నవాళ్లే ఈ హత్యలో పాల్గొన్నారు. రాజకీయాల కోసం హత్యలు చేయడం బందరు రాజకీయాల్లో మాయని మచ్చ’ అని తెలిపారు.(చదవండి : భావోద్వేగానికి లోనైన మంత్రి పేర్ని నాని)
నిందితులను కఠినంగా శిక్షించాలి : భాస్కర్‌రావు కుటుంబ సభ్యులు
భాస్కర్‌రావును రాజకీయ కక్షతోనే హత్య చేశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో భూ అక్రమణలు చేశారని.. వాటిని వెలికి తీస్తున్న సమయంలో భాస్కర్‌రావును హత్య చేశారని ఆయన సోదరి అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment